Advertisement

పైరసీకి అడ్డుకట్ట వేయబోతున్నారు


డీ సినిమాను తలదన్నే డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ డెమోను ఏ.ఎమ్. బి సినిమాస్‌లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మెన్ పి.రామ్మోహన్, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ కె.మురళి మోహన్, తెలుగు నిర్మాతల మండలి ప్రెసిడెంట్ సి.కళ్యాణ్, సి.ఎమ్.డి. డిజికిస్ట్ ఇండియా లిమిటెడ్ కె.బసిరెడ్డి, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సెల్ సెక్రటరీ వడ్లపట్ల, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ సునీల్ నారంగ్, జాయింట్ సెక్రటరీ బాలా గోవింద్ మూర్తి(సుదర్శన్ థియేటర్), తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ అలాగే అన్ని సంస్థల నుండి చాలా మంది ఈసీ మెంబెర్స్, దర్శకుడు వీర శంకర్ పాల్గొన్నారు. 

Advertisement

ఈ సందర్భంగా డిజీక్వెస్ట్ ఇండియా లిమిటెడ్ సీఎండీ బసిరెడ్డి మాట్లాడుతూ..

ఈరోజు సినిమాల ద్వారా అందరు నిర్మాతలకు అన్యాయంగా పైరసీ జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందువల్ల దీని నిర్మూలన కోసం దాదాపు రెండేళ్లు ప్రయత్నం చేస్తూ డిజీక్వెస్ట్ సంస్థ ముందుకొచ్చింది. ఇందులో ప్రత్యేకత ఏంటంటే... డి సినిమా కంటే పైరసీ ప్రొటెక్షన్ ఇందులో ఇమిడి ఉండడం విశేషం. దీంతో పాటు దీని రెవిన్యూ ఏదైతే ఉందో అనుబంధ తెలుగు చలన చిత్ర సంస్థలు సమానంగా పంచుకుంటాయి. ఈ కాబోయే జాయింట్ వెంచర్‌లో భాగస్థులు.. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కామర్స్, డిజీక్వెస్ట్ ఇండియా లిమిటెడ్ సమాన భాగస్థులుగా దీనిని ముందుకు తీసుకెళుతుంది. మన అన్నీ సంస్థల ప్రమేయంతో భవిష్యత్తులో ఆర్థిక పరంగా ఎలా తీసుకొని వెళ్లాలని చర్చించుకుంటారు. వచ్చే వారం రామ్ మోహన్ గారు అందరితో చర్చించడానికి స్వాగతం పలుకుతున్నారు. రామ్ మోహన్ గారు ఈ విషయం పట్ల పటిష్టంగా ఉన్నారు. దీనిద్వారా తెలుగు పరిశ్రమకు మేలు చేయాలని ఆయన దృఢ నిచ్చయంతో ఉన్నారని తెలిపారు.

తెలుగు నిర్మాతల మండలి ప్రెసిడెంట్ సి.కళ్యాణ్ మాట్లాడుతూ...

డి సినిమాను అందరూ సపోర్ట్ చెయ్యాలి. నిర్మాతల కష్టాన్ని పైరసీ ద్వారా వృధాపాలు చేస్తున్నారు. దీన్ని ఖండించాలి. త్వరలో అన్ని రాష్ట్రాల్లో డి సినిమా సేవలు రానున్నాయి, ఇది శుభపరిణామం. బసిరెడ్డి ఈ టెక్నాలజీ తీసుకుని రావడం సంతోషం.. అన్నారు.

ఎఫ్.డి.సి ఛైర్మెన్ పి.రామ్మోహన్ మాట్లాడుతూ..

తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వారందరిని ఆఫీస్‌కు పిలిచి వారిని కలిసి ఈ సినిమా నుండి అయ్యే పైరసినీ ఎలా అరికట్టాలని మాట్లాడి ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నాలు చేశారు. ఇది సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. డిజిటల్ డెలివరీ రేట్స్ అందరూ నిర్మాతలకు అందుబాటులో ఉండాలని ఈ ప్రయత్నం చేస్తున్నాము. ఇండస్ట్రీలో అందరూ నా ప్రపోజల్ ను ఒప్పుకొని దీనికి సపోర్ట్ చేస్తున్నారు, అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది సక్సెస్ చెయ్యాలని నేను దృఢ నిశ్చయంగా ఉన్నాను.. అన్నారు.

Digital Service Provider Demo Event:

New Era for Telugu Cinema
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement