Advertisement
Google Ads BL

‘ఏదైనా జరగొచ్చు’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్ హైలెట్స్


శివాజీరాజా తనయుడు విజయ్‌ రాజా హీరోగా పరిచయం అవుతూ, పూజా సోలంకి, సాషా సింగ్‌ హీరోయిన్లుగా కె. రమాకాంత్‌ దర్శకత్వంలో వెట్‌బ్రెయిన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, సుధర్మ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై సుదర్శన్‌ హనగోడు నిర్మిస్తున్న చిత్రం ‘ఏదైనా జరగొచ్చు’. నేషనల్‌ అవార్డు విన్నర్‌, తమిళ స్టార్‌ బాబీ సింహ ఈ చిత్రంలో నెగటివ్‌ రోల్‌లో కనిపించనున్నారు. అలాగే ఎంతో మంది ప్రముఖ నటీనటులకు నటనలో శిక్షణ ఇచ్చిన వైజాగ్‌ సత్యానంద్‌‌గారి కుమారుడు రాఘవ, ప్రముఖ దర్శకుడు విజయ భాస్కర్‌‌గారి అల్లుడు శివ తేజ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఆగస్టు 23న కె.ఎఫ్‌.సి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ద్వారా విడుదచేయబోతున్నారు.. ఈ సందర్భంగా హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్‌లో ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ ఏర్పాటు చేశారు. 

Advertisement
CJ Advs

ఈ కార్యక్రమంలో నటుడు శివాజీరాజా మాట్లాడుతూ.. ‘‘గత ఆరు నెలల నుండి చిన్న సినిమా పెద్ద సినిమా అని కాకుండా కేవలం స్టోరీ, కంటెంట్‌ బాగున్న సినిమాలే ఎక్కువ విజయం సాధించాయి. దాదాపు 35 సంవత్సరాల క్రితం నేను ‘కళ్ళు’ అనే సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాను. ఆ సినిమా నాకు 17 అవార్డ్స్‌ తెచ్చి పెట్టింది. ఆ సినిమాలో హీరో నేనే అయినా గొల్లపూడిగారు, రఘుగారే హీరోలని నేను ఇప్పటికి చెబుతుంటాను. ఎందుకంటే రచయిత, దర్శకుడే సినిమాకు ప్రాణం. అలాగే ఈ సినిమా కూడా రమాకాంత్‌దే అని చెప్తాను. బాబీసింహగారు అత్యున్నత నటులు, అయన యాక్టింగ్‌ చూడడానికే నేను షూటింగ్‌కి వెళ్ళాను. మ్యూజిక్‌ చాలా బాగుంది. ఆర్టిసులు, టెక్నీషియన్స్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌’’ అన్నారు. 

మ్యూజిక్‌ డైరెక్టర్‌ శ్రీకాంత్‌ పెండ్యాల మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయమయడం సంతోషంగా ఉంది. ఈ ప్రాజెక్టు నాలుగు సంవత్సరాల క్రితం స్టార్ట్‌ అయింది. అన్ని సాంగ్స్‌ అప్పుడే కంపోజ్‌ చేశాం. సందర్భానుసారం వచ్చే సంగీతంతో పాటు ఆర్‌.ఆర్‌ కూడా మిమ్మల్ని మెస్మరైజ్‌ చేస్తుంది’’ అన్నారు. 

నేషనల్‌ అవార్డ్‌ విన్నర్‌ నటుడు బాబీ సింహ మాట్లాడుతూ.. ‘‘2 ఇయర్స్‌ బ్యాక్‌ ఈ స్క్రిప్ట్‌ వినగానే నాకు గూస్‌బమ్స్‌ వచ్చాయి. స్క్రీన్‌‌ప్లే, సీన్స్‌ పోట్రెట్‌ చాలా బాగుంటుంది. ఈ కథను దర్శకుడు ఎలా ఆలోచించారు? ఎలా సీన్లు రాసుకున్నారు? వాటిని ఎలా కనెక్ట్‌ చేశారు? అనేది నాకు ఇప్పటికి సర్ ప్రైజింగ్‌గా ఉంది. విజయ్‌ చాలా మంచి నటుడు, ఫస్ట్‌ మూవీ అయినా ఎలాంటి బెరుకు లేకుండా నటించాడు. టీమ్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్’’ అన్నారు. 

దర్శకుడు కె. రమాకాంత్‌ మాట్లాడుతూ.. ‘‘ఇది ఒక డార్క్‌ కామెడీ హారర్‌ థ్రిల్లర్‌. ఏప్రిల్‌1న పుట్టి స్టుపిడ్‌ పనులు చేసే ముగ్గురి జీవితాలు అనుకోని సంఘటన వల్ల ప్రమాదంలో  పడితే ఆ ప్రమాదం నుండి ఎలా బయటపడ్డారు అనే పాయింట్‌తో ఈ కథ రాసుకున్నాను. తెలుగు స్క్రీన్‌ మీద ఇప్పటి వరకు మీరు చూడని లవ్‌ స్టోరీ ఈ సినిమాలో చూడబోతున్నారు. జాషువా మాస్టర్‌ కంపోజ్‌ చేసిన యాక్షన్‌ సీన్లు సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి. బాబీ సింహ, అజయ్‌ ఘోష్ క్యారెక్టర్స్‌ అద్భుతంగా వచ్చాయి. ఆగస్టు 23న అందరూ సినిమా చూడండి’’ అన్నారు. 

హీరో విజయ్‌ రాజా మాట్లాడుతూ.. ‘‘జిగర్తాండ సినిమాలో బాబీ సింహగారి నటన చూసి ఆయనతో ఒక్క సినిమాలోనైనా నటించాలి అనుకున్నాను. నా మొదటి సినిమాకే ఆయనతో కలిసి నటించడం నా అదృష్టం. అలాగే అజయ్‌ గోష్ లాంటి సీనియర్‌ నటుడితో నటించడం హ్యాపీ. సంగీతం, ఆర్‌ ఆర్‌ అలాగే విజువల్స్‌ సినిమాకు హైలెట్‌. ఈ సినిమా తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను’’ అన్నారు. 

కో ప్రొడ్యూసర్‌ సుదర్శన్‌ హనగోడు మాట్లాడుతూ.. ‘‘రమాకాంత్‌ ఒక స్నేహితుడిలా నాకు హెల్ప్‌ చేశారు. ఒక మంచి సినిమాలో భాగం అయినందుకు సంతోషంగా ఉంది. విజయ్‌, బాబీ సింహ, అజయ్‌ గోష్‌లతో కలిసి వర్క్‌ చేసే అవకాశం రావడం గొప్ప విషయం. ఆగస్టు 23 అందరూ సినిమా చూడండి’’ అన్నారు 

ఇంకా ఈ కార్యక్రమంలో పూజ సోలంకి, సాషా సింగ్‌, ఫైట్‌ మాస్టర్‌ జాషువా, ఎడిటర్‌, ఎస్‌ బి ఉద్దవ్‌, రచ్చరవి పాల్గొని సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

Edaina Jaragochu Movie Pre Release Event Highlights:

Celebrities speech at Edaina Jaragochu Movie Pre Release Event
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs