Advertisement
Google Ads BL

‘సాహో’ దెబ్బకు ఒకేసారి పది సినిమాలు రిలీజ్!


యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్, శ్రద్దా కపూర్ నటీనటులుగా యు.వి.క్రియేషన్స్ బ్యానర్‌పై.. సుజిత్ తెరకెక్కించిన చిత్రం ‘సాహో’. రూ.350కోట్లతో నిర్మితమైన ఈ భారీ చిత్రం ఆగస్ట్ 30న అభిమానుల ముందుకు వచ్చేస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన లుక్స్, సాంగ్స్, టీజర్ అంచనాలను డబుల్ చేసేశాయి. అయితే ‘సాహో’ రిలీజ్ రోజున చిన్న చిన్న సినిమాలు విడుదల చేయడం అంత మంచిది కాదేమోనని భావించిన సదరు చిత్ర నిర్మాతలు ముందుగానే సినిమాను థియేటర్లలోకి తెచ్చేస్తున్నారు.

Advertisement
CJ Advs

అసలు విషయానికొస్తే.. టాలీవుడ్‌లో ప్రతి శుక్రవారం సినిమాలు రిలీజ్ అవుతుండడం ఎప్పట్నించో ఆనవాయితీగా వస్తోందన్న విషయం తెలిసిందే. ఇందుకు కారణం.. వీకెండ్‌లో సినిమా విడుదల అయితే ప్రేక్షకులతో థియేటర్లు కళకళలాడతాయన్నది నిర్మాతలకు ఓ పెద్ద నమ్మకం. అయితే ‘సాహో’ త్వరలో థియేటర్లలోకి వచ్చేస్తుండటంతో ఈ శుక్రవారం ఒకట్రెండు కాదు ఏకంగా 10 సినిమాలు విడుదల చేయడానికి చిత్రనిర్మాతలు సిద్ధమైపోయారు.

ఆగస్టు 23న.. ‘కౌసల్య కృష్ణమూర్తి’, ‘నేనే కేడీ నెం.1’, ‘జిందా గ్యాంగ్’, ‘నీతోనే హాయ్ హాయ్’, ‘ఏదైనా జరగొచ్చు’, ‘బాయ్’, ‘ఉండిపోరాదే’, ‘కనులు కనులు దోచెనే’, ‘నివాసి’, ‘హవా’ చిత్రాలు విడుదల కానున్నాయి. సో.. సాహో కంటే ముందు అంటే ఈ నెల 23న చిన్న సినిమాలకు పండుగే అన్న మాట. మరి ఈ చిత్రాల్లో ఏ మూవీ హిట్ అవుతుందో..? ఏ సినిమా ఫట్ అవుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

Saaho Effect.. Ten movies Releasing On August-23:

Saaho Effect.. Ten movies Releasing On August-23  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs