Advertisement
Google Ads BL

‘సాహో’కి అవే మైనస్ కానున్నాయా?


భారీ బడ్జెట్‌తో భారీగా విడుదలకు ముస్తాబవుతున్న సాహో సినిమా ప్రమోషన్స్ పీక్స్‌లో ఉన్నాయి. ముంబై లో సాహో ట్రైలర్ లాంచ్, హైదరాబాద్ లో సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్.. అన్ని భారీ లెవల్లో జరిగాయి. రామోజీ ఫిలిం సిటీ లో లక్షలాది ఆభిమానుల మధ్యన జరిగిన సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ చూస్తే సాహో భారీతనం అర్థమవుతుంది. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కినా ఈ సాహో లో రొమాంటిక్ యాంగిల్ కూడా ఉంది. లవ్ ట్రాక్ ని కూడా భారీతనం ఉట్టిపడేలా దర్శకుడు తెరకెక్కించాడు. బయటికొస్తున్న పోస్టర్స్ లో ప్రభాస్, శ్రద్ధాకపూర్ ల రొమాంటిక్ యాంగిల్స్ మాములుగా లేవు. కాకపోతే శ్రద్ద లో హాట్ యాంగిల్ చాలా తక్కువ. ఆమెలో రొమాంటిక్ లుక్స్ కానీ, కైపెక్కించే సొగసు కానీ ఉండదు. జేమ్స్ బాండ్ సినిమాలో దొంగల్ని పట్టుకోవడానికొచ్చిన పోలీస్ లా సీరియస్ లుక్ లో కనబడుతుంది తప్పితే.... చాలామంది హీరోయిన్స్ కి ఉండాల్సిన ఆకర్షణ ఆమెలో ఉండదు. ఇక ప్రభాస్ కూడా బాహుబలి లో చూపించిన రొమాంటిక్ యాంగిల్ కానీ, లుక్స్ కానీ సాహో లవ్ ట్రాక్ లో మిస్ అవుతుంది అనే భావన కలుగుతుంది.

Advertisement
CJ Advs

ఇకపోతే సాహో లోని సాంగ్స్ వింటుంటే ఈ భారీ యాక్షన్ చిత్రానికి ఈ పాటలు అస్సలు సూట్ కావనిపిస్తుంది. భారీ సెట్స్ లో భారీ ఖర్చుతో పాటలను చిత్రీకరించారు కానీ.. సాహో సాంగ్స్ లో ఆ రొమాంటిక్ ఫీల్ మిస్ అవుతుంది. అంత డీప్‌గా సాంగ్స్ ప్రేక్షకుడికి ఎక్కే ప్రసక్తి కనిపించడం లేదు. శ్రద్ధాకపూర్ ఎంతగా గ్లామర్ ఒలకబోసినా.. ఆమె గ్లామర్ లుక్ లో తేలిపోవడం ఒక ఎత్తైతే... యాక్షన్ మూడ్ లో ప్రభాస్ ని చూసి చూసి.. సాంగ్స్ లో ప్రభాస్ ని చూస్తే అసలు నప్పడం లేదు. 

అలాగే సాంగ్స్ కూడా వినడానికి వినసొంపుగా అనిపించకపోవడం చూస్తుంటే... ఈ యాక్షన్స్ చిత్రానికి పాటలు మైనస్ గా మారతాయా అనిపిస్తుంది. కాకపోతే జాక్వీలిన్ ఫెర్నాండేజ్ తో చేసిన మాస్ ఐటెం ఏమన్నా ఎక్కితే మాస్ ప్రేక్షకులకు ఎక్కొచ్చు కానీ.. మిగతా పాటలు ఈ సినిమాకి మైనస్ కావడం ఖాయం. మరి సాహో పాటలు సినిమాకి బలమా.. బలహీనత అనేది ఆగస్ట్ 30న కానీ క్లారిటీ రాదు.

Saaho Movie Ready to Release:

Saaho Songs not Attracted 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs