Advertisement
Google Ads BL

మంచు లక్ష్మి వదిలిన ‘హవా’ థీమ్ సాంగ్


మంచు లక్ష్మి విడుదల చేసిన ‘హవా’థీమ్ సాంగ్

Advertisement
CJ Advs

డిఫరెంట్ స్టోరీస్ అనే మాట తరచూ వింటుంటాం.. కానీ అలా అనిపించుకున్న సినిమాలు తక్కువే. అయితే మోషన్ టీజర్ నుంచే మోస్ట్ ఇన్నోవేటివ్ అనిపించుకున్న సినిమా ‘హవా’. ఒక వైవిధ్యమైన ప్రయత్నంగా వస్తోన్న ఈ సినిమాకు క్యాప్షన్ చూస్తేనే తెలుస్తుంది. వీళ్లు ఎంత డిఫరెంట్ స్టోరీతో వస్తున్నారనేది. 9గంటలు, 9బ్రెయిన్స్, 9 నేరాలు అనేదే ఆ క్యాప్షన్. అంటే సినిమా కేవలం 9 గంటల కాలంలో నడుస్తుందన్నమాట. మరి ఆ తొమ్మిదిమంది ఎవరు.. ఏం నేరాలు చేశారు.. అదీ తొమ్మిదిగంటల్లోన.. తద్వారా వాళ్ల లైఫ్ లో జరిగిన మార్పులేంటీ అనేది థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లేతో సాగే కథ. ఇక రేసీగా సాగే  స్క్రీన్‌ప్లే

సినిమాకు మేజర్ హైలెట్ అవుతుంది. తెలుగులో ఇప్పటి వరకూ ఇలాంటి కథనంతో సినిమా రాలేదనుకోవచ్చు. ఇక మరో విశేషం ఏంటంటే.. ఈ సినిమా అంతా పూర్తిగా ఆస్ట్రేలియాలోనే చిత్రీకరణ జరుపుకుంది. పూర్తిగా ఆస్ట్రేలియాలోనే చిత్రీకరించిన తొలి తెలుగు తెలుగు సినిమానూ ఈ చిత్రం రికార్డ్ సాధించింది. అందరూ కొత్తవాళ్లే చేసిన హవా సినిమాపై పరిశ్రమతో పాటు ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలున్నాయి. ఆ అంచనాలు ఏ మాత్రం తగ్గకుండా చూసిన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఈ నెల 23న విడుదల కాబోతోంది హవా.

లేటెస్ట్ గా ఈ సినిమా థీమ్ సాంగ్ ను డైనమిక్ లేడీ మంచు లక్ష్మి చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ.. ‘మేకింగ్ చాలా బావుంది. విజువల్ గ్రాండీయర్ లా కనిపిస్తోంది. ఈ థీమ్ సాంగ్ నాకు బాగా నచ్చింది. పిక్చరైజేషన్ కూడా చాలా ఇంట్రెస్ట్ గా అనిపించింది. అందరూ కొత్తవాళ్లైనా వెరీ ఇంప్రెసివ్ వర్క్ చేశారు. ఇలాంటి కథలు ఇప్పుడు బాగా ఆడుతున్నాయి. హవా కూడా అలాంటి ఇన్నోవేటివ్ స్టోరీలా కనిపిస్తోంది. థీమ్ సాంగ్ చూస్తుంటేనే వీళ్ల కష్టం అర్థం అవుతోంది. ఖచ్చితంగా హవా ఆడియన్స్ కు నచ్చుతుంది. ఈ సినిమా కమర్షియల్ గా కూడా హవా చేయాలని కోరుకుంటున్నాను’ అన్నారు.

హీరోయిన్ దివి ప్రసన్న మాట్లాడుతూ: ‘ఈ టీం తో పనిచేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. హైదరాబాద్ లో ప్రమోషన్స్ కోసం రావడం చాలా ఆనందంగా ఉంది. హావా నాకు మంచి ఎక్స్ పీరియన్స్ గా మిగిలిపోతుంది. నా పాత్ర తప్పకుండా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తుందని నమ్ముతున్నాను. మంచు లక్ష్మి గారు మా సాంగ్ ని లాంఛ్ చేయడం చాలా ఆనందంగా ఉంది’ అన్నారు.

హీరో చైతన్య మాట్లాడుతూ: ‘థీమ్ సాంగ్ ని లాంఛ్ చేసిన లక్ష్మి గారికి థ్యాంక్స్. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమాలో థీమ్  సాంగ్ చాలా ఇంపార్టెంట్. మేం పిక్చరైజ్ చేసిన లొకేషన్స్ ప్రేక్షకులకు కొత్త ఫీల్ ని తెస్తాయి. సినిమా అవుట్ పుట్ విషయంలో టీం అంతా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాము. మా ప్రయత్నానికి ప్రేక్షకులు నుండి మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాను’ అన్నారు.

దర్శకుడు మహేష్ రెడ్డి మాట్లాడుతూ: ‘లక్ష్మీ ప్రియాంక రాసిన పాట చాలా బాగా వచ్చింది. గిప్టన్ ఎలియాస్ మంచి మ్యూజిక్ అందిచారు. ఈ థీమ్ సాంగ్ ని లాంచ్ చేసిన లక్ష్మి గారికి థ్యాంక్స్. చాలా కొత్త కాన్పెస్ట్ తో హవా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఎక్కడా ప్రేక్షకులు రిలాక్స్ అవ్వని కథనం హవాకు హైలెట్ గా నిలుస్తుంది. ఈ సినిమాను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని నమ్ముతున్నాను’ అన్నారు.

చైతన్య మాదాడి, దివి ప్రసన్న జంటగా నటిస్తుండగా.. స్టీఫెన్ మర్ఫీ, ఫోబ్ జాకోబర్, సందీప్ పగడాల, కమల్ కృష్ణ, జో జోసెఫ్, అంజా మేయెర్, ఆల్వోన్ జూనియర్, విలియమ్ ట్రాన్, శ్రీజిత్ గంగాధరన్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

టెక్నికల్ గానూ హై స్టాండర్డ్స్ లో ఉండబోతోన్న ఈ చిత్రానికి ఎడిటర్ : కార్తిక శ్రీనివాస్, సినిమాటోగ్రఫీ : సంతోష్ షానమోని, సంగీతం : గిఫ్టన్ ఎలియాస్, పిఆర్వో: జి.ఎస్.కే మీడియా, నిర్మాణం : ఫిల్మ్ అండ్ రీల్, దర్శకత్వం : మహేష్ రెడ్డి.

Hawaa Theme Song Released:

Hawaa Theme Song Launched by LAKSHMI MANCHU
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs