Advertisement
Google Ads BL

డా. రాజశేఖర్ కొత్త చిత్ర వివరాలివే..!


ఎమోషనల్ థ్రిల్లర్ తో డా. రాజశేఖర్ కొత్త చిత్రం

Advertisement
CJ Advs

టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన డా. రాజశేఖర్ కొత్త సినిమాను ప్రారంభించబోతున్నారు. సరికొత్త తరహా కథాంశంతో ఎమోషనల్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ సినిమాను క్రియేటివ్ ఎంటర్ టైనర్స్ అండ్ డిస్ర్టిబ్యూటర్స్ అధినేత డా. జి. ధనుంజయన్ నిర్మిస్తున్నారు. సింగిల్ లైన్ కథ వినగానే ఎగ్జైట్ అయిన రాజశేఖర్ వెంటనే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం విశేషం. ఈ సినిమాలో సత్యరాజ్, నాజర్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించనున్నారు. ఇటీవల విడుదలైన ‘కిల్లర్’ సినిమాకు సంగీతాన్ని అందించిన సైమన్. కె. కింగ్ డా. రాజశేఖర్ సినిమాకు మ్యూజిక్ అందించబోతున్నారు. తెలుగు ‘క్షణం’ను శిబిరాజ్ తో ‘సత్య’గా తీయటంతో పాటు ‘బేతాళుడు’  సినిమాకు దర్శకత్వం వహించిన ప్రదీప్ కృష్ణమూర్తి ఈ సినిమాకు మెగాఫోన్ పట్టనున్నారు. హీరోయిన్ తో పాటు మిగిలిన పాత్రధారులు, సాంకేతిక నిపుణులను త్వరలో ఎంపిక చేయనున్నారు.

సినిమా టైటిల్ నిర్ణయించి త్వరలో షూటింగ్ మొదలు పెడతామని నిర్మాత జి. ధనుంజయన్ చెబుతున్నారు. సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ పూర్తి చేసి మార్చి 2020లో సినిమాను విడుదల చేస్తామంటున్నారు ధనుంజయన్. సింగిల్ సిట్టింగ్ లో కథను ఓకే చేసి వెంటనే షూటింగ్ మొదలు పెడదామన్న డా. రాజశేఖర్ కు కృతజ్ఞతలు తెలిపారు నిర్మాత ధనుంజయన్.

తమిళంలో రెండు సార్లు జాతీయ అవార్డ్ గెలుచుకున్న నిర్మాత డా. జి. ధనుంజన్. సమంత అక్కినేని నటించిన ‘యు టర్న్’ సినిమాతో పాటు విజయ్ ఆంటోని ‘కొలైకారన్’ ను తమిళంలో విడుదల చేశారు ధనుంజయన్. ఇటీవల మురళీ కార్తీక్, గౌతమ్ కార్తీక్, రెజీనాతో తిరు దర్శకత్వంలో ‘మిస్టర్ చంద్రమౌళి’ సినిమాతో పాటు జ్యోతిక, లక్ష్మీ మంచుతో రాధామోహన్ దర్శకత్వంలో ‘కాట్రిన్ మొళి’ సినిమాను నిర్మించారు ధనుంజయన్. తాజాగా విజయ్ ఆంటోనీతో రెండు వరుస చిత్రాలను నిర్మిస్తున్నారు ధనుంజయన్. డా. రాజశేఖర్ సినిమాతో తెలుగు చిత్రరంగంలోకి అడుగు పెడుతున్నారు. 

డా. రాజశేఖర్, సత్యరాజ్, నాజర్, బ్రహ్మానందం నటించే ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: యస్.పి. శివప్రసాద్, ఫైనాన్షియల్ కంట్రోలర్: సి.ఎ.జి. గోకుల్, పి.ఆర్.వో: నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి, సంగీతం: సైమన్.కె.కింగ్, నిర్మాత: డా. జి. ధనుంజయన్, దర్శకత్వం: ప్రదీప్ కృష్ణమూర్తి.

Dr. Rajasekhar New Movie Details:

Dr Rajasekhar New Movie in Pradeep Krishnamurthy Direction
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs