Advertisement
Google Ads BL

సంక్రాంతి బరిలోకి దిగుతున్న నందమూరి హీరో!


సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతున్న ‘ఎంతమంచివాడవురా’... 

Advertisement
CJ Advs

‘118’తో సూపర్ డూపర్ హిట్ సాధించిన నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘ఎంత మంచివాడ‌వురా’. మెహరీన్ కథానాయిక. శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణలో ఆదిత్య మ్యూజిక్ ఇండియా (ప్రైవేట్‌) లిమిటెడ్‌  నిర్మిస్తున్న చిత్ర‌మిది.  ఉమేష్ గుప్త, సుభాష్ గుప్త‌  నిర్మాత‌లు.  ‘శతమానం భవతి’ చిత్రంతో నేషనల్ అవార్డు గెలుచుకున్న స‌తీశ్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణకు సిద్ధమవుతుంది. ఈ సందర్భంగా.. 

నిర్మాత‌  ఉమేష్ గుప్త మాట్లాడుతూ - ‘‘కల్యాణ్‌రామ్‌, సతీశ్ వేగేశ్న కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘ఎంత మంచివాడవురా’ టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు మాకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అదే పాజిటివ్ వైబ్స్‌తో  అనుకున్న ప్లానింగ్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ‘గీత గోవిందం’, ‘మజిలీ ‘ తదితర బ్లాక్ బస్టర్ చిత్రాలకు సంగీతం అందించిన గోపీసుందర్ ఈ చిత్రానికి అద్భుతమైన స్వరాలు అందిస్తున్నారు. జూలై 31న ఈ సినిమా రెగ్యులర్ షూటి౦గ్‌ను స్టార్ట్ చేశాం. ఆగస్ట్ 17నాటికి తొలి షెడ్యూల్ పూర్తయ్యింది. ఆగస్ట్ 26 నుండి సెప్టెంబర్ 22 వరకు రెండో షెడ్యూల్‌ను తణుకు, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించనున్నాం. ఇందులో ప్రధాన తారాగణమంతా పాల్గొంటారు. రెండు యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు కీలక సన్నివేశాలు, ఒక పాటను చిత్రీకరించబోతున్నాం. అక్టోబర్లో హైదరాబాద్ లోనూ, నవంబర్ నెలలో చిక్‌మంగళూర్ ప్రాంతాల్లో చిత్రీకరణ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌నూ మెప్పించే సినిమాగా తీర్చిదిద్ది సంక్రాంతికి విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.  

ద‌ర్శ‌కుడు స‌తీష్ వేగేశ్న మాట్లాడుతూ.. ‘‘ఒక మంచి కథ , ఒక మంచి హీరో, ఒక మంచి టీం, ఒక మంచి ఫీల్ తో ఈ సినిమా చేస్తున్నాం. ఇటీవలే దిగ్విజయంగా తొలి షెడ్యూల్‌ పూర్తి చేశాం. రెండో షెడ్యూల్‌కు రెడీ అవుతున్నాం. టైటిల్‌ని బ‌ట్టి హీరో క్యార‌క్ట‌రైజేష‌న్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవ‌చ్చు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను వచ్చే  సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని అన్నారు. 

న‌టీన‌టులు:

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, మెహ‌రీన్‌, వి.కె.న‌రేశ్‌, సుహాసిని, త‌నికెళ్ల భ‌ర‌ణి, ప‌విత్రా లోకేశ్‌, రాజీవ్ క‌న‌కాల‌, వెన్నెల‌కిశోర్‌, ప్ర‌వీణ్‌, ప్ర‌భాస్ శ్రీను త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు

రచన, ద‌ర్శ‌క‌త్వం: స‌తీశ్ వేగేశ్న‌

నిర్మాతలు ‌: ఉమేశ్ గుప్త, సుభాష్ గుప్త, 

సమర్పణ :శివలెంక కృష్ణ ప్రసాద్,

సినిమాటోగ్ర‌ఫీ:  రాజ్ తోట‌

సంగీతం:  గోపీ సుంద‌ర్‌

ఎడిటింగ్‌: త‌మ్మిరాజు

ఆర్ట్‌:  రామాంజ‌నేయులు

ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్‌: ర‌షీద్ ఖాన్

Nandamuri Hero Movie In Sankranthi Race:

Entha Manchivaadavuraa Release on Sankranthi 2020
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs