త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతున్న ‘అల వైకుంఠపురములో’ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. రీసెంట్ గా టైటిల్ తో పాటుగా విడుదలైన టీజర్ తో ‘అల వైకుంఠపుములో’ సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఓ మిడిల్ క్లాస్ అబ్బాయిలా కాస్త రఫ్ లుక్ లో కనబడుతున్నాడు. గతంలో త్రివిక్రమ్‌తో చేసిన ‘జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి’ సినిమాలు హిట్ అవడంతో.. ఇప్పుడు ఈ ‘అల వైకుంఠపురములో’ సినిమా మీద కూడా అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ 2 షేడ్స్ లో కనిపించబోతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఒకటి మిడిల్ క్లాస్ అబ్బాయిగా అయితే.. మరొకటి ఓ మల్టీనేషనల్ కంపెనీ ఉద్యోగిగా కనిపిస్తాడంటున్నారు.
ఇక చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాలో హీరోయిన్స్ గా పూజా హెగ్డే, నివేత పేతురాజ్‌లు నటిస్తున్నారు. అలనాటి మేటి నటి టబు కూడా ఈ సినిమాలో ఓ కీ రోల్ ప్లే చేస్తుంది. ఇకపోతే డీజే లో అల్లు అర్జున్ తో పూజా హెగ్డే అదిరిపోయే స్టెప్స్ తో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలోనూ ఈ ఇద్దరు కలిసి డాన్స్ చేస్తే థియేటర్స్ లో విజిల్స్ పడడం ఖాయమంటున్నారు.
అయితే ఈ సినిమాలో ఓ ఐటెం ప్లాన్ చేసినట్లుగానూ, ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఆ ఐటెం కోసం స్పెషల్ గా ట్యూన్స్ కడుతున్నాడని సమాచారం. మరి ఈ సాంగ్ కోసం ఓ టాప్ హీరోయిన్‌ని తీసుకోవాలని త్రివిక్రమ్ అండ్ అల్లు అర్జున్ భావిస్తున్నారట. మాస్ ఆడియన్స్ కోసం స్పెషల్ గా ప్లాన్ చేస్తున్న ఈ సాంగ్ లో మాస్ స్టెప్స్ ఉంటాయట. మరి ‘అల వైకుంఠపురములో’ అల్లు అర్జున్ తో కలిసి ఆ మాస్ స్టెప్స్ వెయ్యబోయే ఆ భామ ఎవరంటూ అప్పుడే మెగా ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డారు.