Advertisement
Google Ads BL

‘ఎవరు’కు బాగా కనెక్ట్ అయ్యారు: దర్శకుడు


‘ఎవరు’లో పాత్రల ఎమోషన్స్‌కి ఆడియెన్స్ బాగా కనెక్ట్ అయ్యారు - డైరెక్టర్ రామ్‌జీ

Advertisement
CJ Advs

అడివిశేష్, రెజీనా కసండ్ర, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఎవరు’. పివిపి సినిమా బ్యానర్‌పై వెంకట్ రామ్‌జీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఆగస్ట్ 15న సినిమా విడుదలైంది. సినిమా పాజిటివ్ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు వెంకట్ రామ్‌జీతో ఇంటర్వ్యూ.. 

*సినిమా ఇంకా 30 శాతం చిత్రీకరించాల్సి ఉండగా నేను ఫైనల్ కట్ చూశాను. నాకు అప్పుడే కాన్ఫిడెంట్ పెరిగింది. ప్రాజెక్ట్ నెక్ట్స్ లెవల్‌లో ఉంటుందే తప్ప.. తగ్గదనిపించింది. రెజీనా, నవీన్‌చంద్రకు అప్పుడే చెప్పాను. ఇప్పుడు చేయబోయే నాలుగైదు సీన్స్ పండాయంటే సినిమా ఆకట్టుకుందన్నాను. సినిమాను ఎక్కువసార్లు చూస్తే ఎక్కువగా ప్రేమించేస్తానేమో అనుకున్నాను. కామన్ ఆడియన్‌కి తెలియకపోవచ్చు కానీ.. నేను చేసిన చిన్న చిన్న తప్పులేంటనేది నాకు తెలుస్తుంటుంది. కాబట్టి సినిమాను ఎక్కువగా కూడా చూడలేదు. ఫైనల్ ఎడిటింగ్ సమయంలో లాక్ చేసే సమయంలో పూర్తి చూశాను. మల్టీప్లెక్ సినిమా అనుకున్నాను. ఎందుకంటే నేనైనా, శేష్ అయినా అమెరికా నుండి చదువుకుని వచ్చాం. అందుకే మాకు మాస్ పల్స్ తెలియవని పీవీపీగారు తిడుతుంటారు. కానీ సినిమా నా అంచనాలను మించి రెస్పాన్స్‌ను రాబట్టుకుంటుంది. సింగిల్ స్క్రీన్స్‌లో ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తున్నారు. విక్రమ్‌ క్యారెక్టర్‌కి అందరూ కనెక్ట్ అయ్యారు. ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి పిచ్చ కిక్ వచ్చింది. అందుకే ముందుగానే ప్రివ్యూస్ వేశాం.

*‘ది ఇన్విజబుల్ గెస్ట్’ పాయింట్‌ని పీవీపీగారు చెప్పగానే కనెక్ట్ అయ్యాను. నేను ఆ సమయంలో సినిమాను థ్రిల్లర్‌లా కాకుండా రివేంజ్ స్టోరీలా చూశాను. న్యాయం కోసం పోరాడే యువకుడి కథే ఇది. దాన్ని డెవలప్ చేసుకుంటూ రావడం వల్ల థ్రిల్లర్‌లా అనిపించింది. ఓరిజినల్ సినిమా ‘ది ఇన్విజబుల్ గెస్ట్‌’ను ఎప్పుడో నార్మల్‌గా చూసేశాను. నాకు ఓకే అనిపించింది. అదే పాయింట్‌ను పీవీపీగారు చెప్పారు. బాగానే ఉందని అనుకున్నాను. అప్పుడు అసలు  సినిమా గురించి చెప్పారు. తర్వాత మరోసారి నేను ఆ సినిమాను చూశాను. 

*ది ఇన్విజబుల్ గెస్ట్ మూవీలోని ఎమోషన్స్ మన తెలుగు నెటివిటీకి సంబంధించింది కాదు. మనం కథలు రాస్తున్నప్పుడు ఓ ఎమోషనల్ ఫీల్ కావాలి. లేకపోతే కనెక్ట్ కాదు. తెలుగు ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ కావాలని ఎమోషన్స్ విషయంలో వర్కవుట్ చేశాం. మాతృకకి మనకు చాలా తేడాలుంటాయి. ఆ విషయంలో నేను చాలా హ్యాపీగా ఫీలవుతాను. హిందీలో దీన్నే‘బద్లా’ పేరుతో రీమేక్ చేస్తున్నారని తెలుసు. అయితే మేం మాతృక నుండి అడాప్ట్ చేసుకున్న విషయాల్లో దేన్నీ మార్చాలనుకోలేదు. ప్రతి క్యారెక్టర్‌కి ఓ లేయర్‌ను తీసుకొచ్చాం. అందుకే ఆడియన్స్ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. 

* నేను పీవీపీ సినిమా బ్యానర్‌లో ఊపిరి, క్షణం, బ్రహ్మోత్సవం సినిమాలకు మార్కెటింగ్ విభాగంలో పనిచేశాను. పెద్ద సినిమాలు చేశాం. మరోసారి చిన్న సినిమా చేద్దామని పీవీపీగారు అనుకున్నారు. అలాంటి టైమ్‌లో పీవీపీగారు నాకు ఈ పాయింట్ చెప్పారు. ఆయనే శేష్‌తో కూడా మాట్లాడారు. క్షణంతో చిన్న సినిమాల పరంగా ఓ మాడ్యుల్ సెట్ చేశాం. దాన్ని మళ్లీ రిపీట్ చేయాలనుకున్నారు. 

* రెజీనా దాదాపు 7-8 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంది. ఆమెకు ఎలాంటి సినిమాలు చేయాలో తెలుసు. తను చాలా సినిమాలు చేశారు. ‘అ!’ నుండి తన పంథా మార్చుకుంది. ఇకపై కెరీర్‌లో ఏ సినిమా చేసినా ఓ గట్ ఫీలింగ్‌తో చేస్తుందని నేను నమ్ముతున్నాను. తను ఎక్స్‌ప్రెసివ్.. సెటిల్డ్‌గా నటిస్తుంది. ఈ సినిమా విషయానికి వస్తే.. తను క్యారెక్టర్‌లోని లేయర్స్ పరంగా అద్భుతంగా నటించింది. 

* నవీన్ చంద్రని నేను హీరోగానే చూశాను. తను సోలోగా హీరోగా సినిమాలు చేసుకుంటున్నాడు. అలాంటి సమయంలో మా సినిమాలో నటిస్తాడని నేను నమ్మలేదు. ‘అరవిందసమేత’ చూసిన తర్వాత తనకి కథ వినమని మెసేజ్ పెట్టాను. తను విని చేస్తానని చెప్పాడు. 

* ఆదిత్య వర్మ పాత్ర కోసం మేం ముగ్గురు చిన్న అబ్బాయిలను తీసుకోవాలని అనుకున్నాం. అందులో నిహాల్‌ని చూడగానే తనలో ఇన్నోసెన్స్ బాగా నచ్చేసింది. ముగ్గురుని లుక్ చేసి నిహాల్‌ని ఎంపిక చేసుకున్నాం. 

* మనం వంద ఆలోచనలను చెబితే అందులో మంచిదేదో సెలక్ట్ చేసుకోవడం శేష్‌కి బాగా తెలుసు. కథకు స్టోరీ పరంగా శేష్, అబ్బూరి రవిగారు హెల్ప్ అయ్యారు. ఇంటర్వెల్ సమయంలో అబ్బూరి రవిగారు చూసి ఎమోషన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇంకా బావుండాలని అన్నారు. నేను మళ్లీ మార్చి రాసుకున్నాను. ఈ సినిమా పరంగా శేష్, అబ్బూరి రవిగారు తొలి ప్రేక్షకులుగా భావిస్తున్నాను. వారి సలహాల ప్రకారం మార్పులు, చేర్పులు చేశాను. 

*శేష్ రెండు థ్రిల్లర్ సినిమాలు చేశాడు. తనకు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఏ మోతాదు, ఎంత ఇవ్వాలనే దానిపై క్లారిటీ ఉంది. కాబట్టి నేనెక్కడైనా ట్రాక్ తప్పినట్లు అనిపించినా తను సలహాలిస్తాడు. ఈ సినిమా యాక్షన్ లేదు కాబట్టి డైలాగ్స్ విషయంలో చాలా కేర్ తీసుకున్నారు. 

*వారం పదిరోజుల తర్వాత తదుపరి కథతో హీరోలను కలవాల్సి ఉంది. నేను మొదట అనుకున్న కథతో సినిమా చేసే అవకాశం ఉందనుకుంటున్నాను. అది కూడా థ్రిల్లర్ సబ్జెక్ట్.

Evaru Movie Director Ramji Interview:

Director Ramji Talks about Evaru Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs