Advertisement
Google Ads BL

సెప్టెంబర్ 6న విడుదలవుతున్న ‘జోడి’


వైవిధ్యమైన కథా,కథనాలతో వస్తున్న యూత్ పుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘జోడి’. విభిన్నమైన కథలతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్న హీరో ఆది,  యుటర్న్, జెర్సీ సినిమాలతో సౌత్ లో క్రేజీ హీరోయిన్‌గా మారిన శ్రర్ద శ్రీనాథ్ హీరో, హీరోయిన్లుగా జోడి సెప్టెంబర్ 6న విడుదలకు సిద్దం అయ్యింది.  ప్యామిలీ ఎమోషన్స్ చుట్టూ తిరిగే అందమైన ప్రేమకథగా తెరకెక్కిన జోడి అన్ని వర్గాల ప్రేక్షలకు ఆకట్టుకునే అంశాలతో రాబోతుంది.  విడుదలైన టీజర్ ఇండస్ట్రీ లోనూ, ప్రేక్షకుల్లోనూ ఆసక్తిని పెంచింది.  సినిమా బిజినెస్ కి కూడా మంచి ఆఫర్స్ రావడంతో చిత్ర యూనిట్ ఆనందంగా ఉంది. హీరో ఆది, హీరోయిన్ శ్రర్ద శ్రీనాథ్ లుక్స్‌కి ప్రత్యేక ప్రశంసలు దక్కుతున్నాయి.

Advertisement
CJ Advs

దర్శకుడు విశ్వనాథ్ ఆరిగెల మాట్లాడుతూ.. ‘ఈ సినిమా ముగ్గురి నమ్మకంతో ముందుకు కదిలి ఇప్పుడు రిలీజ్ వరకూ వచ్చింది. అందులో ఒకరు ప్రొడ్యూసర్ విజయలక్ష్మిగారు కథ వినగానే అందులోని ఎమోషన్స్‌కి కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఇది చెప్పాల్సిన కథ అని అన్నారు. మరొకరు శ్రర్ధ శ్రీనాథ్ కథ వినగానే మనం ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాం అని అన్నారు. అప్పటి నుండి ఎన్ని అవాంతరాలొచ్చినా నాకు సపోర్ట్‌గా నిలిచారు. మరొకరు హీరో ఆది గారు.. ఆయన సినిమాలోనే కాదు నిజజీవితంలో కూడా హీరోనే. ఈ సినిమా కథ వినగానే ఇలాంటి కథ కోసమే నేను చూస్తున్నా అన్నారు.

హీరో ఆది మాట్లాడుతూ.. ‘నేను ఎప్పటి నుండో ఒక రియలిస్టిక్ అప్రోచ్ ఉన్న మూవీ చేయాలనుకుంటున్నాను. అదే టైం విశ్వనాథ్ కథ చెప్పగానే నేను బాగా కనెక్ట్ అయ్యాను.  విన్నప్పుడు కలిగిన ఫీల్ స్ర్కీన్ మీద మరింతగా పెరిగింది. శ్రర్ద చాలా ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ , తన యూటర్న్ మూవీ నాకు చాలా ఇష్టం. ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యాక చాలా మంది తెలిసిన వాళ్ళు కాల్ చేసి చాలా క్రొత్త గా ఉన్నావు అంటుటే చాలా హ్యాపీగా ఉంది. నరేష్ గారు సెట్ లో ఉంటే ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.  వండర్ పుల్ యాక్టర్ తో పనిచేయడం చాలా సంతోషాన్నిచ్చింది. వెన్నెల కిషోర్ నాకోస ఈ సినిమా చేసాడు చాలా థ్యాంక్స్. ప్రొడ్యూసర్ విజయలక్ష్మి గారు ఈ సినిమా కోసం చాలా ఎఫెర్ట్స్ పెట్టారు. సెప్టెంబర్ 6న రాబోతున్నాం, మిమ్మల్ని ఎంటర్ టైన్ చేస్తాం అనే నమ్మకం ఉంది’ అని అన్నారు.

ఆది సాయికుమార్, శ్రద్ధా శ్రీనాథ్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో సీనియర్ యాక్టర్ వి.కే. నరేష్, సత్య, వెన్నెల కిశోర్, సిజ్జు, స్వప్నిక, సితార, మాధవి, గొల్లపూడి మారుతిరావు, వర్షిణి సౌందరరాజన్, ప్రదీప్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. భావనా క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీనివాస్ గుర్రం సమర్పిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం : ‘నీవే’ ఫణికళ్యాణ్, సినిమాటోగ్రఫీ : ఎస్.వి. విశ్వేశ్వర్, ఎడిటర్ : రవి మండ్ల, ఆర్ట్ డైరెక్టర్ : వినోద్ వర్మ, మాటలు : త్యాగరాజు(త్యాగు), నిర్మాణత : శాంతయ్య, పి.ఆర్.వో : జి.ఎస్.కె. మీడియా, నిర్మాతలు : పద్మజ, సాయి వెంకటేష్ గుర్రం, దర్శకత్వం : విశ్వనాథ్ అరిగెల.

Jodi release on 6 September:

Jodi release on 6 September
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs