Advertisement
Google Ads BL

ఆ హీరో ఇంట్లో లొల్లి కొలిక్కిరాలేదుగా!


ప్రముఖ నటుడు దర్శన్‌- విజయలక్ష్మీ దంపతుల మధ్య వివాదం నెలకొనడం ఆ తర్వాత పెద్దలు జోక్యం చేసుకోవడంతో.. గొడవలకు ఫుల్‌స్టాప్ పడినట్లైంది. అయితే.. తాజాగా మళ్లీ ఈ ఇద్దరి మధ్య వివాదం రేగిందని ఇండస్ట్రీలో కోడై కూస్తోంది. ట్విట్టర్‌ వేదికగా ఇద్దరు ఒకరినొకరు అన్‌ ఫాలో అవ్వడం.. అంతేకాదు.. విజయలక్ష్మీ దర్శన్‌ పేరుతో ఉన్నట్విట్టర్‌లో ఖాతా నుంచి దర్శన్‌ అనే పదాన్ని తొలగించడంతో మరింత వివాదాం ముదిరిందని స్పష్టంగా అర్థమవుతోంది. 

Advertisement
CJ Advs

అంతేకాదు.. వీరిద్దరూ కొంతకాలంగా ఇద్దరు వేరువేరుగా నివసిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. విజయలక్ష్మిని పెళ్లి చేసుకున్న దర్శన్ జీవితం సజావుగానే జరిగింది. ఆ తర్వాత.. ఓ హీరోయిన్‌తో దర్శన్ చెట్టాపట్టాలేసుకుని తిరగడంతోనే ఈ వివాదం మొదలైందని.. అంతేకాదు ఫొటోలు కూడా నెట్టింట్లో ప్రత్యక్షమవ్వడంతో గొడవలు మరింత ముదిరాయని తెలుస్తోంది.

అప్పట్లో లోలోపలే కొంతమంది సినీ ప్రముఖులు జోక్యం చేసుకొని వివాదాలకు ఫుల్‌స్టాప్ పెట్టినప్పటడం జరిగింది. అయితే తాజాగా మళ్లీ హీరో ఇంట్లో లొల్లి మొదలైందట. అయితే ఈ గొడవలకు ఫుల్‌స్టాప్ పెట్టి.. సంధి చేకూర్చేందుకు గానూ ఏకంగా ఓ ప్రముఖ నటుడు, రాజకీయనాయకుడు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ దెబ్బతో దర్శన్ ఇంట్లో రచ్చకు ఫుల్‌స్టాప్ పడుతుందో.. ఇంకా కామాలు పెట్టుకుంటూ ముందుకెళ్తుందో వేచి చూడాల్సిందే మరి.

Clashes Between Hero and His Wife:

Clashes Between Hero and His Wife
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs