Advertisement
Google Ads BL

మొదటిసారి జాతీయ జెండా ఆవిష్కరించిన ‘నాని’


73వ స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని మొదటిసారి జాతీయ జెండాను ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నామని హీరో నాని చెప్పారు. హైదరాబాద్ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్లో జరిగిన స్వాతంత్ర వేడుకల్లో నాని ముఖ్య అతిధిగా పాల్గొన్నారు .ఈ సందర్భంగా నాని జాతీయ జెండా ను ఆవిష్కరించారు. ‘ఈ వేడుకల్లో పాల్గొని జెండా ఆవిష్కరణ చెయ్యమని అధ్యక్షులు డాక్టర్ కే. ఎల్. నారాయణ గారు ఆహ్వానించారు. ఇక్కడికి వచ్చాక ఇంతమంది స్కూల్ పిల్లలు ఉత్సాహంగా పాల్గొనడం చూసి చాలా సంతోషం అనిపించింది. నాకు స్కూల్ డేస్ గుర్తుకొచ్చాయి. ఆగస్టు 15 , జనవరి 26న జరిగే జెండా పండుగ అంటే చిన్నప్పుడు ఉత్సాహంగా పాల్గొనేవాడిని. ఈరోజు వేడుకలో నేను జెండాను ఆవిష్కరిస్తానని అనుకోలేదు. మొదటిసారి జాతీయ జెండాను ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా అనిపించింది. ఇంత మంది చిన్న పిల్లల  మధ్య లో... నేను కూడా చిన్నవాడినై పోతే బాగుండు అనిపించింది’ అని నాని ఆనందంగా చెప్పాడు. 

Advertisement
CJ Advs

కల్చరల్ సెంటర్ అధ్యక్షుడు కె.ఎల్ నారాయణ మాట్లాడుతూ .. 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో నాని పాల్గొనడం మా అందరికీ ఎంతో సంతోషంగా వుంది , మా కల్చరల్ సెంటర్ పక్కనే వున్న స్కూల్ ను దత్తత చేసుకొని వారికి కావలసిన సౌకర్యాలను ఏర్పాటుచేస్తున్నామని ఈ సందర్భంగా నారాయణ చెప్పారు. ఈ కార్యక్రమంలో 200 మంది చిన్నారులు పాల్గొని తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు. అంతే కాదు స్వాతంత్ర దినోత్సవ వేడుకల ప్రాధాన్యత గురించి చిన్న పిల్లలు అద్భుతంగా మాట్లాడారు.

నాని చిన్న పిల్లతో కలసి పోయి వారితో ఫోటోలు తీయించుకున్నారు . ఈరోజు తన జీవితంలో మరపురాని రోజని నాని ఈ సందర్భంగా చెప్పారు .ఈ  కార్యక్రమంలో తుమ్మల రంగారావు, రాజ శేఖర్ రెడ్డి, జెమినీ కిరణ్, ఆదిశేషగిరి రావు ,గిరి బాబు, మోహన్ ముళ్ళపూడి, కిషోర్, శివారెడ్డి, భగీరథ, కాజా సూర్యనారాయణ, సురేష్ కొండేటి మొదలైనవారు పాల్గొన్నారు.

natural star nani hoisted first time national flag:

natural star nani hoisted first time national flag
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs