చి.ల.సౌ అనే ప్రేమ కథ చిత్రంతో డీసెంట్‌గా దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు రాహుల్ రవీంద్రన్. ఆ సినిమాని అక్కినేని హీరో సుశాంత్‌తో తీసాడు. ఇక ఆ సినిమా హిట్ అనగానే నాగార్జున కొన్నాళ్ల గ్యాప్ తర్వాత రాహుల్‌ని పిలిచి ఓ ఫ్రెంచ్ మూవీ రీమేక్‌గా‘మన్మథుడు-2’ ని తియ్యమని అడగటంతో.. ఎగిరి గంతేసి రాహుల్ ‘మన్మథుడు-2’ ని పెద్ద హీరో నాగార్జునతో మొదలెట్టాడు. సినిమా మీద మొదటి నుంచి మంచి అంచనాలున్నాయి. నాగార్జున కూడా కథ మీద నమ్మకంతో తానే ఆ సినిమాని ప్రొడ్యూస్ చేశాడు. అయితే మంచి అంచనాల మధ్యన విడుదలైన ‘మన్మథుడు-2’ తుస్ మంది. గత శుక్రవారం విడుదలైన మన్మధుడు 2కి యావరేజ్ టాక్ రాగా.. కలెక్షన్స్ మాత్రం ఉసూరుమనిపించాయి.
ఇక ‘మన్మథుడు-2’ యావరేజ్ టాక్‌తో అయినా ..నాగ్ క్రేజ్ కారణంగా మంచి కలెక్షస్ వస్తాయనుకుంటే... కలెక్షన్స్ మరీ చీప్‌గా ఉండేసరికి సక్సెస్ టూర్‌ని కూడా నాగ్ క్యాన్సిల్ చేసాడు. అయితే సినిమా మరీ బోల్డ్‌గా ఉండడం, కథలో బలం లేకపోవడమే కాదు... దర్శకత్వంలోని బలహీనతల వలన మన్మధుడుకి యావరేజ్ టాక్ పడింది. రాహుల్ మేకింగ్ స్టయిల్ ఏమాత్రం ఇంప్రెస్స్ చేసేదిలా లేదు. మరి ‘మన్మథుడు-2’ విడుదలకు ముందు హిట్ అవుతుందననుకున్నారు. అందుకే రాహుల్‌తో సినిమాలు చేసేందుకు కొన్ని నిర్మాణ సంస్థలు మొగ్గు చూపాయి కూడా. కానీ సినిమా విడులయ్యాక రాహుల్ నెక్స్ట్ సినిమా విషయంపై సందిగ్దత నెలకొంది. ‘మన్మథుడు-2’ తర్వాత నాగార్జున మరో సినిమా చెయ్యడానికి పెద్దగా టైం పట్టదు... కానీ రాహుల్ కి మరో హీరో దొరకాలంటే కష్టమే. ‘మన్మథుడు-2’ తో ద్వితీయ విజ్ఞాన్ని దాటలేకపోయిన రాహుల్ ఇప్పుడు మూడో సినిమా ఏ హీరోతో ఎప్పుడు సినిమా మొదలు పెడతాడో.. అనే క్యూరియాసిటీ అందరిలో ఉంది.