Advertisement
Google Ads BL

‘సైరా’.. ‘సాహో’.. రెండూ రెండే!!


టాలీవుడ్ నుండి రెండు బిగ్ ప్రాజెక్ట్స్ నేషనల్ వైడ్ గా తెరకెక్కుతున్నాయి అంటే... ఆ సినిమాల మీద ఏ రేంజ్ క్రేజ్ ఉంటుందో అందరికి తెలుసు. సినిమాలు మొదలయినప్పటినుండి అన్ని భిషల ప్రేక్షకుల కళ్ళు ఆ సినిమాల మీద ఉంటాయి. గతంలో బాహుబలి విషయంలో రాజమౌళి అన్ని భిషల ప్రేక్షకులను తనవైపు తిప్పుకోవడానికి చాల కష్టపడ్డాడు. కానీ సాహో, సై రా లాంటి బిగ్ ప్రాజెక్ట్స్ బాహుబలి అండతో... సినిమాలు మొదలైనప్పటినుండే అందరి చూపు తమ మీద పడేలా చేసుకున్నాయి. నిన్న మొన్నటివరకు కేవలం పోస్టర్స్ తో సరిపెట్టిన సాహో, సై రా టీమ్స్ ఇప్పుడు భారీ ప్రమోషన్స్ కి తెర తీశాయి. ఇక సాహో చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కితే.. సై రా చిత్రం చారిత్రాత్మక చిత్రంగా తెరకెక్కింది.

Advertisement
CJ Advs

ఇక ఈ చిత్రాల మీద నిన్నమొన్నటివరకు ఉన్న అంచనాలు వేరు... నేడు ఉన్న అంచనాలు వేరు. ఎందుకంటే సాహో చిత్ర ట్రైలర్ విడుదలయ్యాక ఈ సినిమాపై ట్రేడ్ లోను, ప్రేక్షకుల్లోనూ మరిన్ని అంచనాలు పెరిగాయి. ఆ రేంజ్ యాక్షన్ ఎపిసోడ్ తో సాహో ట్రైలర్ హాలీవుడ్ రేంజ్ లో అదరగొట్టేసింది. ఇక బాలీవుడ్ కూడా సాహో ట్రైలర్ చూసాక ఆ చిత్రంపై మరింత ఆసక్తిని పెంచుకుంది. ఇక తాజాగా చిరు సైరా నరసింహారెడ్డి మేకింగ్ వీడియో ని చూస్తే గూస్ బమ్స్ వచ్చేస్తున్నాయి. అంతలా ఉంది సై రా మేకింగ్ వీడియో. అన్ని భాషల ప్రేక్షకులు మెచ్చేలా ఉంది. తెర వెనుక కష్టం తెర మీద కనిపిస్తుంది అన్నట్టుగా.. సైరాలోని మేకింగ్ వీడియోలో ప్రతి ఫ్రేమ్ సైరా కోసం టెక్నీషియన్స్ ఎంతగా కష్టపడ్డారో తెలియజెయ్యడమే కాదు... ఆ చిత్ర మేకింగ్ లో అడుగడుగునా భారీ తనం కొట్టొచ్చినట్టుగా కనబడింది.

ఇక సైరా చిత్రంలోని కీలక పాత్ర పోషిస్తున్న నటులు లుక్స్ కూడా అలా అలా రివీల్ చేసింది టీం. నయనతార, తమన్నా, జగపతిబాబు లాంటి నటుల లుక్స్ ని కూడా రివీల్ చెయ్యడంతో సినిమాపై భారీ అంచనాలు వచ్చేసాయి. మరి అక్టోబర్ 2 న రాబోతున్న సై రా చిత్ర మేకింగ్ తో తెలుగులోనే కాదు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీలోనూ రికార్డులను కొల్లగొట్టడం ఖాయంగా కనబడుతుంది. ఇక సాహో ట్రైలర్ తో సై రా మేకింగ్ వీడియో తోనూ దుమ్ముదులిపి ఆరేశాయి.

Saaho and Sye Raa to clash at box office?:

&nbsp; Saaho and Sye Raa to clash at box office? <div></div>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs