Advertisement
Google Ads BL

18న రామోజీ ఫిల్మ్ సిటీలో సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్


ప్రభాస్ హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న హై రేంజ్ యాక్షన్ ఎంటర్టైనర్ సాహో ట్రైలర్ ఇటీవలే విడుదలై సంచలనాలు సృష్టిస్తోంది. అత్యున్నత సాంకేతిక నిపుణులతో వరల్డ్ క్లాస్ సినిమాగా వస్తుంది సాహో. తాజాగా విడుదలైన ట్రైలర్ అంచనాలను మరింత పెంచింది. ఇక ఇప్పుడు ఈ హీట్ ని మరింత పెంచేందుకు రామోజీ ఫిల్మ్ సిటీ లో కనీ వినీ ఎరుగని రీతిలో ఈ నెల 18న చేయనున్నారు. ఈ వేడుక కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అభిమానులు భారీగా వచ్చే ఈ వేడుక కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. చిత్ర యూనిట్ తో పాటు సినీ ప్రముఖులు హాజరయ్యే ఈ వేడుకను ఇప్పటివరకు చేయని రీతిలో ప్లాన్ చేస్తున్నారు.  

Advertisement
CJ Advs

ఇక సినిమా విషయానికి వస్తే... హాలీవుడ్ సినిమాల స్థాయిలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు దర్శకుడు సుజీత్. గల్లీలో సిక్స్ ఎవడైనా కొడతాడు!! స్టేడియంలో కొట్టేవాడికే ఒక రేంజ్ ఉంటది... అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్ కి సోషల్ మీడియా బ్రహ్మరథం పట్టింది. ఇక ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేశారు. ముఖ్యంగా ట్రైలర్లో విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. ప్రభాస్ యాక్షన్ సీన్స్ కు  ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది. శ్రద్ధా కపూర్ తో రొమాంటిక్ సీన్స్ కూడా బాగా వర్కవుట్ అయ్యాయి. వాళ్ల కెమిస్ట్రీకి మంచి మార్కులు పడుతున్నాయి. ఈ సినిమా కోసం విదేశీ స్టంట్ కొరియోగ్రాఫర్లు పని చేశారు. 2 నిమిషాల 47 సెకన్ల నిడివి ఉన్న ట్రైలర్లో అన్ని ఎమోషన్స్ మిక్స్ చేశాడు దర్శకుడు సుజీత్. దుబాయ్, రొమేనియా లో తెరకెక్కించిన యాక్షన్ సన్నివేశాలు ట్రైలర్ లో హైలైట్ అయ్యాయి. వాటితో పాటు ప్రభాస్ గెటప్ కూడా అదిరిపోయింది. జిబ్రన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ కు అదనపు ఆకర్షణ. ఆగస్టు 30న సాహో ప్రేక్షకుల ముందుకు రానుంది.

శ్ర‌ద్ధా క‌పూర్ ఈ సినిమాలో హీరోయిన్. నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజ‌య్, జాకీ ష్రాఫ్ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. భారీ ఖర్చుతో యూవీ క్రియేష‌న్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ప్ర‌భాస్ అభిమానుల‌కు ఇది పండ‌గ లాంటి సినిమా అని మాటిస్తున్నాడు ద‌ర్శ‌కుడు సుజీత్.

Saaho pre-release event details revealed:

Saaho pre-release event details revealed  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs