అర్జున్ రెడ్డి, గీత గోవిందం బ్లాక్ బస్టర్ హిట్స్ తో ఓ రేంజ్ లో క్రేజ్ లోకొచ్చిన విజయ్ దేవరకొండ కోసం చాలామంది నిర్మాతలు క్యూలో నిలబడ్డారు. కానీ విజయ్ మాత్రం తనకు ఆనుకూలంగా ఉన్న నిర్మాతలతో ఆచి తూచి సినిమాలు చేస్తున్నాడు. కాకపోతే డియర్ కామ్రేడ్ గనక హిట్ అయితే విజయ్ రేంజ్ మరింతపెరిగేది. కానీ డియర్ కామ్రేడ్ దెబ్బకి.. ఇప్పటికే మైత్రి మూవీస్ వారు విజయ్ కి దూరం జరగరాని.. దానికి చిన్న ఉదాహరణ హీరో సినిమానే అంటున్నారు. ఇప్పటివరకు జరిగిన హీరో సినిమా షూటింగ్ రషెస్ నచ్చక మైత్రి మూవీస్ వారు హీరో షూటింగ్ కి బ్రేకేసారు. తాజాగా ఆ ప్రాజెక్ట్ ని అటకెక్కించేస్తున్నట్లుగా టాక్. అందుకే విజయ్ ఇస్మార్ట్ శంకర్ తో ఫామ్ లోకొచ్చిన పూరి తో సినిమా కి ఒకే చెప్పాడంటున్నారు.
అయితే హీరో, క్రాంతి మాధవత్ తో చేస్తున్న సినిమాలు తర్వాత విజయ్ దేవరకొండ తో దిల్ రాజు సినిమా చెయ్యాలని చూడడమే కాదు... విజయ్ తో తన ఆస్థాన దర్శకులల్తో కథలు కూడా చెప్పించాడట. ఇక విజయ్ మొదట్లో దిల్ రాజు తో సినిమా చేసేందుకు మొగ్గు చూపినా... తర్వాత తర్వాత దిల్ రాజు విషయం పక్కనబెట్టేశాడట. అందుకే దిల్ రాజు తో కాకుండా ఇప్పుడు పూరి, ఛార్మి నిర్మాతలుగా పూరి తో సినిమాకి కమిట్ అయ్యాడట. అయితే ఎప్పటినుండో విజయ్ కోసం కాచుకు కూర్చున్న దిల్ రాజు కి ఈ విషయం మింగుడు పడడం లేదట. అందరూ దిల్ రాజుతో సినిమా చెయ్యాలని వెంపర్లాడుతుంటే... విజయ్ దేవరకొండ మాత్రం దిల్ రాజు ని లైట్ తీసుకోవడంతో దిల్ రాజుకి మండిందనే న్యూస్ ఫిలింసర్కిల్స్ లో నడుస్తుంది. అయితే ఈ విషయంలో కాకమీదున్న దిల్ రాజు, విజయ్ దేవరకొండ తో ఇక ఎప్పటికి సినిమా నిర్మించే ఛాన్స్ లేదంటూ ఫిలింనగర్ లో గుసగుసలాడుతున్నారు.