సాహో కి మొదటి నుండి ఏదొక విషయంలో కాపీ అనే మాట వస్తుంది. ఈసినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు వెంటనే అది హాలీవుడ్ సినిమా లుక్ కి కాపీ తేల్చేశారు నెటిజన్లు. ఆ తరువాత మరో పోస్టర్ విషయంలో కూడా ఇదే జరిగింది. కాపీ పోస్టర్ అంటూ ట్రోల్ చేసారు. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ లో ఒక డైలాగ్ అచ్చం మరో తెలుగు సినిమా నుండి కాపీ కొట్టినట్టు ఉందని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
రెండు రోజులు కిందట రిలీజ్ అయిన సాహో ట్రైలర్ లో ఓ డైలాగ్ ఉంటుంది. ‘గల్లీలో సిక్స్ ఎవడైనా కొడతాడు... కానీ స్టేడియంలో కొట్టేవాడికే ఒక రేంజ్ ఉంటది’ అని ప్రభాస్ చెప్పిన డైలాగ్ అందరినీ ఆకట్టుకుంది. పైగా ఈ డైలాగ్ బాగా పేలింది కూడా. అయితే ఇప్పుడు ఆ డైలాగ్ ని తీసుకుని అల్లు అర్జున్ జులాయి సినిమాలో డైలాగ్ తో పోలుస్తూ కాపీ అని చెప్తూ ట్రోల్స్ చేస్తున్నారు. నిజమే రెండు సినిమాల్లో డైలాగ్స్ ఒకేలా ఉన్నాయి.
కానీ డైలాగ్ విషయం ఇంత రచ్చ చేయాల్సిన అవసరం లేదు. సుజీత్ ఈ డైలాగ్ చాలా మామూలుగానే రాసుకొని ఉంటాడు. కానీ అది జులాయికి మ్యాచ్ అయింది. అంతకు మించి ఇందులో తప్పు పట్టడానికి లేదు. కంటెంట్ కాపీ కొడితే మనం మాట్లాడుకోవాలి కానీ ఏదో చిన్న డైలాగ్ కాపీ కొట్టారని మాట్లాడుకోవడం ఎంతవరకు కరెక్ట్?