Advertisement
Google Ads BL

‘ఏదైనా జరగొచ్చు’ ట్రైలర్ వదిలారు


శివాజీరాజా తనయుడు విజయ్‌ రాజా హీరోగా పరిచయం అవుతూ, పూజా సోలంకి, సాషా సింగ్‌ హీరోయిన్లుగా కె.రమాకాంత్‌ దర్శకత్వంలో వెట్‌ బ్రెయిన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, సుధర్మ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై సుదర్శన్‌ హనగోడు నిర్మిస్తున్న చిత్రం ‘ఏదైనా జరగొచ్చు’. ఈ చిత్ర ట్రైలర్‌ విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో ఘనంగా జరిగింది. అతిథిగా విచ్చేసిన నటుడు శివాజీరాజా ట్రైలర్‌ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  ‘ఈ సినిమాకి హీరో, హీరోయిన్‌, దర్శకుడు ఇలా అన్నీ రమాకాంతే. మూడేండ్లు ఈ కథని మోస్తూ వస్తున్నాడు. అనుకున్న అవుట్‌పుట్‌ రావడం కోసం రాజీపడకుండా వర్క్‌ చేశాడు. ప్రతి సీన్‌ బాగా రావడం కోసం ఎంతో తపించాడు. అజయ్‌ ఘోష్‌, నాగబాబు, వెన్నెల కిషోర్‌ వంటి పెద్దపెద్ద ఆర్టిస్టులను ఎంచుకున్నారు. సమీర్‌ రెడ్డి కెమెరా వర్క్‌ సినిమాకి పెద్ద అసెట్‌. సినిమా బాగుందని నేను చెప్పను. ఈ నెల 23న విడుదలయ్యాక ఆడియెన్స్‌ చెబుతారు. అయితే చాలా మంది ‘మీ అబ్బాయి లవ్‌ స్టోరీతో లాంచ్‌ అవుతున్నారా’ అని అడుగుతున్నారు. కానీ నేను రమాకాంత్‌ ని నమ్మాను. కథ నచ్చి ఒప్పుకున్నా.  సినిమా హిట్‌ కావాలని టీమ్‌ అంతా కష్టపడ్డారు. ఇన్ని రోజులు నన్ను ఎంతో ఆదరించారు. ఇప్పుడు మా అబ్బాయిని బ్లెస్‌ చేయాలని కోరుకుంటున్నా. సినిమాకి సపోర్ట్‌  చేసిన కె.రాఘవేంద్రరావు, వినాయక్‌, శ్రీకాంత్‌, తరుణ్‌ వంటి వారికి థ్యాంక్స్‌’ అని అన్నారు. 

Advertisement
CJ Advs

చిత్ర దర్శకుడు రమాకాంత్‌ మాట్లాడుతూ,  ‘నన్ను నమ్మి వాళ్ళ అబ్బాయిని నా చేతుల్లో పెట్టిన శివాజీరాజాకి థ్యాంక్స్‌. బాబీ సింహా కీలక పాత్రలో కనిపిస్తారు. డార్క్‌ కామెడీ హర్రర్‌ థ్ల్రిలర్‌గా సినిమాని రూపొందించాం. కాన్సెప్ట్‌ బేస్డ్‌ చిత్రమిది. ఏప్రిల్‌ ఫస్ట్‌న పుట్టిన ముగ్గురు ఫూల్స్‌ చేసే స్టుపిడ్‌ పనుల వల్ల ఎలాంటి ఇబ్బందులో పడ్డారనే కథాంశంతో తెరకెక్కించాను. సమీర్‌ రెడ్డి కెమెరా అద్భుతం. విజయ్‌ ఎక్కడా మొదటి సినిమాలా  కనిపించలేదు. చాలా ఈజీగా షాట్‌ చేసేవాడు. ఏదైనా అర్థం కాకపోతే సిగ్గుపడకుండా అడిగి తెలుసుకుని నటించేవాడు. అజయ్‌ ఘోష్‌ డిఫరెంట్‌ రోల్‌లో కనిపిస్తారు. కచ్చితంగా సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు సరికొత్త అనుభూతిని పొందుతారు’ అని చెప్పారు.  

నటుడు అజయ్‌ ఘోష్‌ మాట్లాడుతూ,  ‘ఆర్టిస్టుగా నిరూపించుకునే పాత్ర కోసం చాలా రోజులుగా వెయిట్‌ చేస్తున్నా. ఇందులో అలాంటి పాత్ర దొరికింది. మంచి  పాత్ర ఇచ్చిన దర్శకుడికి థ్యాంక్స్‌’ అని అన్నారు. 

అనంతపురం జగన్‌ చెబుతూ, ‘శివాజీరాజాది ఎంత గొప్ప మనసో ఆ స్థాయికి విజయ్‌ ఎదగాలని కోరుకుంటున్నా. ఇది అద్భుతమైన థ్రిల్లర్‌ సినిమా. పెద్ద విజయం సాధించాలి’ అని తెలిపారు. 

నిర్మాత సుదర్శన్‌ చెబుతూ,  ‘తెలుగు ఆడియన్స్‌ సినిమాని ఎంతో ప్రేమిస్తారు. వారి ప్రేమ వల్లే ఎంతో మంది సూపర్‌స్టార్స్‌ అయ్యారు. ఈ  నెల 23న విడుదల కానున్న మా సినిమాని ఆదరించి పెద్ద హిట్‌ చేస్తారని ఆశిస్తున్నా’ అని అన్నారు. 

హీరో విజయ్‌ రాజా చెబుతూ,  ‘నేనీ స్థానంలో ఉండటానికి కారణమైన మా తల్లిదంద్రులకు థ్యాంక్స్‌.  బాబీ సింహా పాత్రలో ఆయన్ని తప్ప మరెవ్వరినీ ఊహించుకోలేం. రవి, రాఘవ సెట్‌లో నాకు ధైర్యాన్నిచ్చారు. నాతో పనిచేసిన సీనియర్‌ ఆర్టిస్టులకు ధన్యవాదాలు. నాపై నమ్మకంతో సినిమా తీసిన దర్శకుడు రమాకాంత్‌కి ఎన్నిసార్లు థ్యాంక్స్‌ చెప్పినా తక్కువే. ఆయనకు రుణపడి ఉంటాను’ అని అన్నారు. 

హీరోయిన్‌ పూజా చెబుతూ,  ‘నాకిది తెలుగులో తొలి సినిమా. భాష తెలియకపోయినా టీమ్‌ అంతా ఎంతో సపోర్ట్‌ చేశారు. సీనియర్స్‌ గైడ్‌ చేశారు. నా పాత్రని బాగా తీర్చిదిద్దిన దర్శకుడికి, అవకాశం ఇచ్చిన నిర్మాతకి థ్యాంక్స్‌’ అని తెలిపారు. 

మరో హీరోయిన్‌ సాషా సింగ్‌ చెబుతూ,  ‘ఈ సినిమాలో భాగమైనందుకు చాలా హ్యాపీగా ఉంది. ఆదరించాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో రవి, రాఘవ తనదైన కామెడీతో సందడి చేశారు. 

ఇతర తారాగణం: విజయ్ రాజా, పూజా సోలంకి, సాషా సింగ్, బాబీ సింహా, రవి శివ తేజ, వైవా రాఘవ,  నాగబాబు, అజయ్‌ ఘోష్‌, వెన్నలె కిశోర్‌, తాగుబోతు రమేష్ తదితరులు ఇతర పాత్రలు  పోషిస్తున్నారు. 

టెక్నీషియన్లు: 

దర్శకుడు: కే. రమాకాంత్

బ్యానర్లు:  వెట్‌ బ్రెయిన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, సుధర్మ్‌ ప్రొడక్షన్స్‌

సహ నిర్మాత: పి. సుదర్శన్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్‌ప్రకాష్‌ అన్నంరెడ్డి

సంగీతం: శ్రీకాంత్‌ పెండ్యాల

సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి 

ఎడిటర్‌: ఎస్‌.బి.ఉద్ధవ్‌

మాటలు: వికర్ణ 

స్క్రీన్‌ప్లే: కోటి బండారు, వేణుగోపాల్‌రెడ్డి 

ఆర్ట్‌: రమేష్‌

లిరిక్స్‌: ఇమ్రాన్‌ శాస్త్రి, ప్రణవ్‌చాగంటి,అలరాజు

పీఆర్‌ఓ: వంశీ శేఖర్‌.

Edaina Jaragochu Trailer Released:

Shivajiraja Released Edaina Jaragochu Trailer
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs