Advertisement
Google Ads BL

ప్రభాస్‌ను ఆకాశానికెత్తేసిన బాలీవుడ్ భామ


‘బాహుబలి’ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ మరో భారీ సినిమా ‘సాహో’తో అభిమానుల ముందకు రాబోతున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ అందాల భామ శ్రద్ధా కపూర్ నటించింది. దాదాపు రూ. 300 కోట్లకుపైగా బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్ 30న థియేటర్లలోకి రానుంది. ఇప్పటి వరకూ పెద్దగా ప్రమోషన్స్ జోలికి పోని ఈ చిత్రబృందం సాహో ట్రైలర్ లాంచ్‌లో పాల్గొన్న శ్రద్ధా.. సినిమా ఎలా ఉంటుంది..? ప్రభాస్ రీల్, రియల్‌ లైఫ్‌లో ఎలా ఉంటాడు..? అనే విషయాల గురించి శ్రద్ధా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

Advertisement
CJ Advs

ప్రభాస్ సూపర్‌స్టార్ మాత్రమే కాదని.. ఆయన మనసు వెన్నఅని ఈ ముద్దగుమ్మ రెబల్‌స్టార్‌ను ఆకాశానికెత్తేసింది. యూనిట్ మొత్తం ప్రభాస్ మంచి మనసుకి ఫిదా అయిపోయామని చెప్పుకొచ్చింది. చిత్రబృందం చూపించే ప్రేమాభిమానాల వల్ల ప్రతి రోజూ సెట్స్‌కి వెళ్లాలని అనిపించేదని ఈ ముద్దుగుమ్మ చెప్పింది. శ్రద్ధా మాటలతో రెబల్ స్టార్ వీరాభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.

ఇదిలా ఉంటే.. ‘సాహో’తో బాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఈ మూవీ తర్వాత బాలీవుడ్‌లోనూ క్రేజ్ మరింత పెరిగిందని చెప్పుకోవచ్చు. మరి టాలీవుడ్‌లో ‘సాహో’తో ఏ మాత్రం మెప్పిస్తుందో వేచి చూడాల్సిందే మరి. ఇదిలా ఉంటే.. శ్రద్దా ప్రధాన పాత్రలో నటించిన ‘సాహో’ 30న రిలీజ్ కానుండగా.. మరో మూవీ ‘చిత్తోర్’ కూడా సెప్టెంబర్ 6న రిలీజ్‌కి సిద్ధమైంది.

Prabhas is a Huge Superstar but Has the Most Amazing Heart, Says Shraddha Kapoor:

Prabhas is a Huge Superstar but Has the Most Amazing Heart, Says Shraddha Kapoor  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs