ఆర్‌ఎక్స్ బ్యూటీ ఆర్.డి.ఎక్స్. అందాల్లో..!


RX 100 సినిమాలో నెగెటివ్ షెడ్ ఉన్న పాత్రలో బోల్డ్ యాక్టింగ్ తో అదరగొట్టిన పాయల్ రాజపుత్ కి ఆ సినిమా హిట్ అయినా ఓ అన్నంత అవకాశాలు అయితే రాలేదు. RX 100 తర్వాత పాప బాగా బిజీ అవుతుందనుకుంటే... ఒక్క స్టార్ హీరో గాని, యంగ్ హీరో గాని పాప కేసి చూడలేదు. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ సీత సినిమాలో ఐటెంతో అదరగొట్టిన పాయల్ రాజపుత్.. వెంకటేష్ సరసన వెంకీమామలో నటిస్తుంది. ఇక తాజాగా RX 100 లాంటి మరో సినిమా ఆర్ డి ఎక్స్ లవ్ లో పాయల్ అందాలు అదరహో అన్న రేంజ్ లో కనిపిస్తున్నాయి. హాట్ హాట్ యాంగిల్స్ లో హాట్ హాట్ ఫొటోస్ తో పాయల్ రాజపుత్ చేస్తున్న గ్లామర్ షో కి అందరూ ఫిదా అవుతున్నారు.

ప్రస్తుతం బయటికొచ్చిన ఆర్ డి ఎక్స్ లవ్ ఫొటోస్ లో పాయల్ రాజపుత్ అందాల ఆరబోత మాములుగా లేదు. రెడ్ డ్రెస్ లో పాయల్ గ్లామర్ ఆరబోస్తూ కిక్కెక్కించే లుక్ లో హీటెక్కిస్తోంది. ఆ రెడ్ కలర్ డ్రెస్ లో పాయల్ రాజపుత్ పెట్టిన ఫోజ్ కి యూత్ మొత్తం ఆమెకి సలాం కొడుతోంది. ఆ రేంజ్ అందాలను ఒక్క స్టార్ హీరో కానీ, యంగ్ హీరో కానీ యూస్ చేసుకోలేకపోయారంటే పాపం అనిపిస్తుంది. అమ్మడుకి అవకాశం రావాలే కానీ.. బికినీ వేసి మరీ అందాలు ఆరబోసేస్తుంది. RX 100 లో ఒకలాగా రెచ్చిపోతే... ఇప్పుడు ఆర్ డి ఎక్స్ లవ్ గ్లామర్ తో మరోలా రెచ్చిపోతుంది. మరి ఇలాంటి హాటెస్ట్ ఫోజులకైనా యంగ్ హీరోల చూపు అమ్మడు మీద పడుతుందేమో చూద్దాం. ఏది ఏమైనా పాయల్ వరస చూస్తుంటే మాత్రం.. అమ్మడు హీరోలను తనవైపు తిప్పుకునే దాక ఊరుకునేలా లేదు.

Payal Rajput Hot Photos Released from RDX Love Movie:

Payal Rajput Red Hot photos Creates Sensation
Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES