సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ డియర్ కామ్రేడ్ చిత్రం డిజాస్టర్ గా మిగిలిపోయింది. సినిమా చాలా స్లోగా ఉండడంతో ప్రేక్షకులు దీన్ని తిరస్కరించారు. ఇది పక్కన పెడితే ఈ సినిమా యొక్క హిందీ రైట్స్ ప్రముఖ బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ మూవీ రిలీజ్ కి ముందు స్పెషల్ స్క్రీనింగ్ లో చూసిన కరణ్ ఇది ఓ అందమైన ప్రేమకథ అని, తనకు బాగా నచ్చిందని ట్వీట్ చేశారు. అయితే ఈ సినిమా రీమేక్ లో బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్‌ను ఎంపిక చేసుకోవాలని కరణ్ అనుకున్నారట. అందుకోసం షాహిద్ కపూర్ ఏకంగా 40 కోట్లు రెమ్యూనరేషన్ అడిగాడట.
కానీ రీసెంట్ గా అతను ఈ సినిమా చేయను అని చెప్పేసాడు అని బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే షాహిద్ కపూర్ అర్జున్ రెడ్డి రీమేక్ లో నటించారు. ఇప్పుడు ఈ సినిమా రీమేక్ లో నటిస్తే ప్రేక్షకులను ఆకట్టుకోదేమోనన్న ఉద్దేశంతోనే సినిమాకు ‘నో’ చెప్పినట్లు టాక్.