Advertisement
Google Ads BL

ఇలాంటి రోజు కోసమే వెయిటింగ్: బెల్లంకొండ


మా ఏ స్టూడియోస్ బ్యానర్‌పై తొలి చిత్రంగా చేసిన ‘రాక్షసుడు’ చిత్రాన్ని పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్ – కోనేరు సత్యనారాయణ

Advertisement
CJ Advs

బెల్లంకొండ సాయిశ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా రమేశ్ వర్మ దర్శకత్వంలో ఎ స్టూడియో బ్యానర్‌పై కొనేరు సత్యనారాయణ నిర్మించిన చిత్రం ‘రాక్షసుడు’. ఆగస్ట్ 2న విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతుంది. ఈ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో కార్యక్రమంలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్, కొనేరు సత్యనారాయణ, రమేశ్ వర్మ, అభిషేక్ నామా, మారుతి, అమలాపాల్, మల్టీడైమన్షన్ వాసు, వెంకట్, నిర్మాత భరత్ చౌదరి, శరవణన్, వినోద్ సాగర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా... 

కొనేరు సత్యనారాయణ మాట్లాడుతూ - ‘‘ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘రాక్షసుడు’ మాటనే వినపడుతుంది. ఆగస్ట్ 2న రాక్షసుడు విడుదలైంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ సినిమా మాత్రమే చక్కగా రాణిస్తుంది. తమిళంలో ఈ సినిమాను చూసినప్పుడు ఎంత థ్రిల్ ఫీలయ్యానో అదే ఫీలింగ్ ఈరోజు కలుగుతుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సినిమాను థ్రిల్లింగ్‌గా ఫీలవుతున్నారు. మంచి సినిమాను తీస్తే అందరూ సినిమాను బాగా ఆదరిస్తారనడానికి ఈ సినిమా ఓ నిదర్శనంగా నిలుస్తుంది. ఓ పద్ధతి ప్రకారం ఈ సినిమాను ప్లానింగ్‌తో, సిస్టమేటిక్‌గా చేశాను. ప్రమోషన్స్ విషయంలో చక్కగా కేర్ తీసుకున్నాను. అందువల్లనే సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. తర్వాత మంచి మౌత్ టాక్ కారణంగా మంచి కలెక్షన్స్ వచ్చాయి. రెండో వారం కూడా ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. సినిమాలో మంచి మెసేజ్ కూడా ఉంది. మేం అనుకున్న ఫలితాన్ని సాధించినందుకు ఆనందంగా ఉంది. బెల్లంకొండ అంతకు ముందు చేసిన ఆరు సినిమాల కంటే బాగా ఈ సినిమాలో యాక్ట్ చేశాడు. తనని ఏ ఉద్దేశంతో అయితే సెలక్ట్ చేసుకున్నామో దానికి అతను న్యాయం చేశాడు. సాయి ఎక్స్‌ట్రార్డినరీగా నటించాడు. అనుపమ పరమేశ్వరన్ చక్కగా నటించింది. విలన్‌గా చేసిన శరవణన్, టీచర్ పాత్రలో చేసిన వినోద్, రాజీవ్ కనకాల చాలా చక్కగా నటించారు.  సినిమా అందరికీ కనెక్ట్ అయ్యింది. వెంకట్ ప్రతి సన్నివేశాన్ని అద్భుతమైన విజువల్స్‌తో తెరకెక్కించారు. జిబ్రాన్ మ్యూజిక్ ఎక్సలెంట్ మ్యూజిక్ అందించారు. రమేశ్ వర్మ మా బ్యానర్‌లో చేసిన తొలి సినిమాతో నా పేరు నిలబెట్టారు. అందరూ సినిమాను ముక్తకంఠంతో బావుందని అనడంతో చాలా సంతోషంగా ఉంది. డైరెక్టర్‌ ఏమి అడిగితే దాన్ని సమకూర్చాను. అభిషేక్‌గారు సినిమాను గ్రాండ్ రిలీజ్ చేశారు. హిందీ హక్కులను కూడా ఆదిత్య బాటియావారికి అమ్మేశాం. తొలి సినిమాగా ఈ సినిమాను చేసినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను తమ సినిమాగా భావించి చేశారు. భవిష్యత్‌లోనూ మా ఏ స్టూడియో బ్యానర్ నుండి మంచి చిత్రాలనే అందిస్తాం’’ అన్నారు. 

మారుతి మాట్లాడుతూ - ‘‘సిన్సియర్ సినిమాను రూపొందించారు. అంతే గొప్పగా సినిమాను ప్రేక్షకులు ఆదరించారు. ఓ రీమేక్ సినిమాను ఎలా చేయాలో అంత బాగా రీమేక్ చేశారు. స్క్రిప్ట్ డెప్త్ సినిమా చూసేటప్పుడు కనపడుతుంది. తమిళంలో ఉన్న సినిమాను పాడుచేయకుండా దర్శకుడు రమేశ్ వర్మ చక్కగా తెరకెక్కించారు. సాయిశ్రీనివాస్ చాలా సిన్సియర్‌గా ఈ సినిమాలో నటించారు. మంచి సినిమాలు చేయాలని ఇండస్ట్రీకి వచ్చిన కొనేరు సత్యనారాయణ వంటి వ్యక్తులు మనకు ఎంతో అవసరం’’ అన్నారు. 

అభిషేక్ నామా మాట్లాడుతూ - ‘‘తొలిరోజు వర్షం పడగానే కాస్త భయపడ్డాను. అయితే తొలిరోజున సినిమా యూనానిమస్ హిట్ టాక్ రాగానే హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ కంటే సెకండ్ వీక్‌లో సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. సాయి చాలా బాగా వచ్చింది. సినిమా సక్సెస్ ఇలాగే కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. 

అమలాపాల్ మాట్లాడుతూ - ‘‘రాక్షసుడు సినిమా యూనిట్‌కి అభినందనలు. తమిళంలో సినిమా చాలా పెద్ద హిట్ అయ్యంది. అలాంటి సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకోవడానికి చాలా ధైర్యం ఉండాలి. రమేశ్ వర్మగారికి అభినందించాలి. శ్రీనివాస్ చాలా సెటిల్డ్‌గా నటించారు. నిర్మాతలకు, ఎంటైర్ యూనిట్‌కి అభినందనలు’’ అన్నారు. 

బెల్లంకొండ సాయిశ్రీనివాస్ మాట్లాడుతూ - ‘‘ఇలాంటి ఓ అద్భుతమైన రోజు కోసం చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాను. మా ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులకు థ్యాంక్స్. రమేశ్ వర్మగారికి, కొనేరు సత్యనారాయణగారికి థ్యాంక్స్. వెంకట్ చాలా కష్టపడి వర్క్ చేశాడు. అందరూ మనసు పెట్టి పనిచేశారు. అందరికీ రుణపడి ఉంటాను. విలన్‌గా నటించిన శరవణన్‌గారు ఎక్సలెంట్‌గా నటించారు. చాలా టఫ్ జాబ్ చేశారు. ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్. కమర్షియల్ సక్సెస్‌తో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న సినిమా ఇది. సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్స్’’ అన్నారు. 

రమేశ్ వర్మ మాట్లాడుతూ - ‘‘రీమేక్స్ చేయడం చాలా కష్టం. తమిళ్‌లో సినిమా చూస్తున్నప్పుడు నాకు శ్రీనివాసే కనపడ్డాడు. తను యాక్ట్ చేసిన తర్వాత సినిమా చూస్తే నా ఆలోచనకు తనెంత న్యాయం చేశాడోననిపించింది. తమిళంలో చేసిన కొందరినీ తెలుగులో కూడా తీసుకున్నాను. మెయిన్ విలన్‌గా చేసిన శరవణన్‌.. ఆ  పాత్రను తను తప్ప మరెవరూ చేయలేరనిపించింది. అందుకే తననే నటింప చేశాను. బెల్లంకొండ సురేశ్‌గారికి, సాయిశ్రీనివాస్‌కి స్పెషల్ థ్యాంక్స్’’ అన్నారు.

Rakshasudu Movie Success Meet Details:

Celebrities speech at Rakshasudu Success meet
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs