Advertisement
Google Ads BL

‘రణరంగం’ ఈ ట్రైలర్ టెర్రిఫిక్: చరణ్


‘రణరంగం’ సౌండ్ కట్ ట్రైలర్ ను విడుదలచేసిన  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 

Advertisement
CJ Advs

యువ కథానాయకుడు శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శినిల కాంబినేషన్ లో ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో, ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ‘రణరంగం’. ఈ ఆగస్టు 15 న విడుదల అవుతున్న విషయం విదితమే. చిత్ర ప్రచారంలో భాగంగా   ‘రణరంగం’ సౌండ్ కట్ ట్రైలర్ విడుదల అయింది. 

‘రణరంగం’ చిత్రం  సౌండ్ కట్ ట్రైలర్ ను  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  ఈరోజు  విడుదలచేశారు. రామ్ చరణ్ కు శర్వానంద్ మంచిమిత్రుడు. తన మిత్రుడి చిత్రం సౌండ్ కట్ ట్రైలర్ ను చూసిన అనంతరం ఆయన స్పందిస్తూ...‘సూపర్బ్..సౌండ్ కట్ ట్రైలర్ చాలా కొత్తగా వుంది. టెర్రిఫిక్ గా ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ఇటీవలే విడుదల అయింది. మళ్ళీ శర్వానంద్ ని మేము ఎలా అయితే చూడాలనుకున్నామో అలావుంది. పర్ఫెక్ట్ గా ఉంది. శర్వాలో ఉన్నది, మాకు నచ్చింది. అతనిలో ఉన్న ఇంటెన్సిటీ. అతని చిత్రాల్లో కో అంటే కోటి చిత్రం నాకిష్టం. అలాంటి ఇంటెన్సిటీతో ఉన్న చిత్రం శర్వాకు పడితే బాగుంటుంది అనుకునేవాడిని. ఇప్పుడీ రణరంగం సౌండ్ కట్ ట్రైలర్ ను చూసిన తరువాత అలాంటి చిత్రం అనిపించింది. దర్శకుడు సుధీరవర్మ ఈ చిత్రంతో తన ప్రతిభను మళ్ళీ నిరూపించుకున్నారనిపించింది. చాలా మంచి ప్లాట్ ఉన్న చిత్రం. సన్నివేశాల తాలూకు కట్స్ చాలా బాగున్నాయి. ఇంట్రస్టింగ్ గా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. టెర్రిఫిక్ గా ఉంది. ప్రశాంత్ పిళ్ళై సంగీతం బాగుండటంతో పాటు కొత్తగా ఉంది. డెఫినెట్ గా చిత్రం విజయం సాధించాలని చిత్రం యూనిట్ కు అభినందనలు తెలిపారు రామ్ చరణ్. ఈ కార్యక్రమంలో చిత్ర కథానాయకుడు శర్వానంద్, నిర్మాత  సూర్యదేవర నాగవంశీ పాల్గొన్నారు.

ఈ చిత్రానికి మాటలు: అర్జున్ - కార్తీక్, సంగీతం : ప్రశాంత్ పిళ్ళై , ఛాయాగ్రహణం :దివాకర్ మణి, పాటలు: రామజోగయ్య శాస్త్రి, కృష్ణ చైతన్య,ఎడిటర్: నవీన్ నూలి,  ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, పోరాటాలు:వెంకట్, నృత్యాలు: బృంద, శోభి,శేఖర్, ప్రొడక్షన్ కంట్రోలర్: సి.హెచ్. రామకృష్ణారెడ్డి,  

సమర్పణ: పి.డి.వి.ప్రసాద్.

నిర్మాత: సూర్యదేవర నాగవంశీ 

రచన-దర్శకత్వం: సుధీర్ వర్మ   

Mega Powerstar Ram Charan unveils Sound Cut trailer of Ranarangam:

Ranarangam Sound Cut trailer Released
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs