Advertisement
Google Ads BL

‘వాల్మీకి’ క్రేజ్ ఎలా ఉందో చూశారా?


సెప్టెంబర్ 6 న వచ్చేస్తున్నామంటూ ఆఫీషియల్ గా ప్రకటించిన హరీష్ శంకర్ - వరుణ్ తేజ్ ల వాల్మీకి టీం... సాహో ఆగష్టు 30 ఫిక్స్ అయ్యేసరికి... మారుమాట్లాడకుండా సెప్టెంబర్ 13 కి షిఫ్ట్ అయ్యింది. డీజేతో హరీష్ శంకర్ కి ఒరిగింది ఏం లేదుగాని... ఎఫ్ 2 తో మంచి ఫామ్ లో ఉన్న వరుణ్ తేజ్ వాల్మీకి మీద మంచి అంచనాలే ఉన్నాయి. కాకపోతే నిన్నగాక మొన్న సక్సె ఫుల్ యంగ్ హీరో నేచురల్ స్టార్ నాని కూడా తన గ్యాంగ్ లీడర్ ని సెప్టెంబర్ 13 కి విడుదల చేస్తున్నట్లుగా చెప్పడంతో....వరుణ్ తేజ్ - నానీతో తలపడాల్సి వస్తుంది. ఇకపోతే తమిళ జిగర్తాండకి వాల్మీకి సినిమా రీమేక్. వాల్మీకి సినిమా టైటిల్ మీద కాంట్రవర్సీ నెలకొన్నా అది సినిమా ప్రమోషన్స్ కి బాగా పనికొచ్చింది.

Advertisement
CJ Advs

అయితే విడుదలకు ఓ నెల మాత్రమే ఉన్న వాల్మీకి బిజినెస్ ఓ రేంజ్ లో మొదలయ్యింది. తెలుగు సినిమాలకు అతి పెద్ద మార్కెట్ ఏరియా నైజాంలో వాల్మీకి హక్కులు రికార్డు స్థాయి (అంటే వరుణ్ తేజ్ మార్కెట్ కి భారీగా అన్నమాట...)కి అమ్ముడుపోయాయి. వాల్మీకి నైజాం హక్కులు 7.30 కోట్లకు శ్రీనివాసరావు అనే వ్యక్తి కొనుగోలు చేసాడు. ఈ రేంజ్ వాల్మీకి హక్కులు కొనడానికి కారణం.. ఈ మధ్యనే రామ్ - పూరిల ఇస్మార్ట్ శంకర్ సినిమా కొన్న శ్రీనివాసరావుకి ఇస్మార్ట్ శంకర్ తో భారీ లాభాలు రావడంతో... వరుణ్ తేజ్ వాల్మీకి మీదున్న అంచనాలతో వాల్మీకి హక్కులను భారీ రేటుకి కొనుగోలు చేసారు. ఇక  నైజాంలో భారీగా అమ్మిన వాల్మీకి మిగతా ఏరియాలలోను  మంచి రేటు పలికే అవకాశం ఉంది. ఈ సినిమాలో వరుణ్ సరసన పూజా హెగ్డే నటించడం ఓ ప్లస్ పాయింట్. అలాగే తమిళంలో సూపర్ హిట్ అయిన  సినిమాకి రిమేక్ కావడం మరో హైలెట్. అందుకే వాల్మీకి సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి.

Valmiki Nizam Rights Sold out:

Valmiki Nizam Business Completed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs