Advertisement
Google Ads BL

‘సాహో’ ట్రైలర్: ట్రైలర్‌తోనే ఓ రేంజ్ వచ్చేసింది!


భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సాహో మీద ఎంతగా అంచనాలున్నాయో... సాహో ట్రైలర్ కోసం ఎదురు చూసిన క్షణాలు చూస్తేనే తెలుస్తుంది. గత మూడు రోజుల్లో గంటకో పోస్టర్ చొప్పున విడుదల చేస్తూ.. ప్రేక్షకులను గ్రిప్ లో పెట్టుకుని... మరీ సాహో ట్రైలర్ ని విడుదల చేసింది సాహో టీం. ఈ రోజు ఉదయం నుండి సాహో ట్రైలర్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా.. డార్లింగ్ ప్రభాస్ ని ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆయన అభిమానులే కాదు.. నాలుగు భాషల ప్రేక్షకులు కూడా ఎదురు చూసారు. ఆ క్షణం రానే వచ్చింది... భారీ హంగులతో సాహో ట్రైలర్ విడుదలైంది. డార్లింగ్ ప్రభాస్ అందాన్ని కాదు... ఆయనలోని రొమాంటిక్ అండ్ యాక్షన్ అండ్ కండలు తిరిగిన బాడీని చూసి అందరూ నోరెళ్లబెట్టేసారు. అలాగే సాహో భారీ యాక్షన్ సన్నివేశాలే కాదు... హీరోయిన్ శ్రద్ధా కపూర్ తో కావాల్సినంత రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఉన్నాయి.

Advertisement
CJ Advs

యువి క్రియేషన్స్ లో భారీ బడ్జెట్ తో సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన సాహో రెండు ఇమిషాల ట్రైలెర్ లో... ముంబైలో జరిగిన రెండువేల కోట్ల దోపిడీ కేసుని ఛేదించేందుకు ప్రభాస్ ని అండర్ కవర్ కాప్ గా పోలీస్ యంత్రాంగం రంగంలోకి దింపుతోంది. ఇక ఈ ప్రభాస్ కి తోడుగా మరో క్రైం బాంచ్‌ ఆఫీసర్‌ అమృత నాయర్ గా హీరోయిన్ శ్రద్ధాకపూర్ పరిచయమవుతుంది. ప్రభాస్, శ్రద్ధా కపూర్ లు కలిసి ఆ దోపిడీ దొంగల ఆట ఎలా కట్టించారనేది... భారీ యాక్షన్ తో అందమైన రొమాంటిక్ సన్నివేశాలతో సాహోని మలిచారు. ఇక భారీ యాక్షన్ సన్నివేశాల్లో విలన్స్ గా నీల్ నితిన్ ముఖేష్, మందిర బేడీ, మహేష్ మంజ్రేకర్, అరుణ్ విజయ్ లు ఒక్కో ఫ్రేమ్ లో మెరిశారు. మరి యాక్షన్ సన్నివేశాల కోసం హాలీవుడ్ నిపుణులను ఎందుకు తెచ్చారో సాహో యాక్షన్ సన్నివేశం ప్రతి ఫ్రేమ్ లో కనబడుతుంది. ప్రభాస్ అండర్ కవర్ కాప్ గా, ప్రేమికుడిగా ఆరడుగుల ఆజానుబాహుడుగా అదరగొట్టాడు. ప్రభాస్ బాహుబలికి భిన్నంగా సాహో లుక్స్ ఉన్నాయి. ఇక శ్రద్ధా కపూర్ నార్మల్ లుక్స్ తోనే ప్రభాస్ వెన్నంటి ఉండే క్రైం బాంచ్‌ ఆఫీసర్‌ గా ఆకట్టుకుంది.

ముఖ్యంగా మురళి శర్మతో ప్రభాస్ కార్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు.. విలన్ చూసావుగా నా మాస్టర్ స్ట్రోక్... ఇట్స్ ఏ సిక్సర్ అనగా... దానికి ప్రభాస్.. గల్లీలో సిక్స్ ఎవడన్నా కొడతాడురా... కానీ స్టేడియంలో కొట్టేవాడికే ఒక రేంజ్ ఉంటుంది అని చెప్పే డైలాగు బావుంది.  వెన్నెలకిషోర్ గోస్వామి పాత్రలో మెరవగా... యువి వారు ఇంత ఎందుకు ఖర్చు పెట్టారో సాహో యాక్షన్ సన్నివేశాల్లోనే కాదు... లవ్ ట్రాక్ లోను ఆ రిచ్ నెస్ కనబడుతుంది. జిబ్రాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లగా... సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ అనేంతటి రిచ్ నెస్ ని తీసుకొచ్చింది. సాహో యాక్షన్ సన్నివేశాలను చూస్తుంటే... హాలీవుడ్ ని తలిపిస్తున్నాయి. కేవలం రెండు నిమిషాల ట్రైలర్ కే రోమాలు నిక్కబొడుచుకుంటే.. సినిమాలో చూసే యాక్షన్ ని ఇంకెంతగా ఎంజాయ్ చేస్తారో ప్రేక్షకులు.

Click Here For Trailer

Saaho Movie Trailer Review:

Saaho Trailer Released and Gets Good Response
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs