Advertisement
Google Ads BL

‘మనం సైతం’ ఉచిత వైద్య శిబిరం


తమ చుట్టూ ఉన్నవారంతా తమ వాళ్ళే అనుకుంటూ సేవా కార్యక్రమాలు చేస్తోంది కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలోని మనం సైతం సేవా సంస్థ. చిత్రపురి కాలనీలో కార్మికుల కోసం ఉచిత వైద్య శిబిరం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యుడు రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, జనసేన నేత జేడీ లక్ష్మీనారాయణ అతిధులుగా పాల్గొన్నారు. 

Advertisement
CJ Advs

ఈ సందర్బంగా కాదంబరి కిరణ్ మాట్లాడుతూ.. నాది ఏ రాజకీయ రంగూ కాదు. నా రక్తం రంగు ఎరుపు. ఈ రంగుకు పేద, ధనిక తేడా లేదు. అందరూ సమానమే. పేదలకు ఎక్కడ అవసరం ఉన్నా నా వంతు సాయం అందిస్తా. నేను పేదవాడిని. అందుకే పేదలకు అండగా నిలబడ్డాను. వివిధ రాష్ట్రాల నుంచి ఎంతోమంది కార్మికులు పొట్టకూటి కోసం ఇక్కడికి పనిచేసేందుకు వస్తున్నారు. వాళ్లకు అనారోగ్య సమస్యలు తరుచూ ఎదురవుతుంటాయి. చికిత్స తీసుకునే స్తోమత ఉండదు. అందుకే చిత్రపురి కాలనీలో పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికుల కోసం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశాం. నా సేవా కార్యక్రమాలు కేవలం పేదల కోసమే. ఎలాంటి రాజకీయ ఉద్ధేశాలు లేవు. టీఆర్ఎస్ లో నేనొక కార్యకర్తను. మనం సైతం కార్యక్రమానికి ఎప్పుడూ అండగా ఉంటారు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్న, ఎంపీ రంజిత్ రెడ్డి అన్నగారు. ఇవాళ కార్యక్రమానికి హాజరైన జేడీ లక్ష్మీనారాయణ గారికి కృతజ్ఞతలు.. అన్నారు.

జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ...కాదంబరి కిరణ్ అలుపు ఎరుగని సేవా సైనికుడు. నిత్యం పేదల కోసమే ఆలోచిస్తుంటాడు. వాళ్లకు అండగా ఉంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు. సినిమాల్లో నటిస్తూ ఇంత తీరిక ఈయనకు ఎలా దొరుకుతుంది అని ఆశ్చర్యమేస్తుంటుంది. కిరణ్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అద్భుతం. అన్నింటికంటే ముఖ్యమైనది ఆరోగ్యం. దాన్ని కాపాడుకుంటేనే ఏదైనా సాధించగలం. కాదంబరి ఆ విషయాన్ని గుర్తించి మీకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అన్నారు.

మనం సైతం సేవా కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తివంతంగా ఉన్నాయంటూ కాదంబరిని ప్రశంసించారు ఎమ్మెల్యే ఫ్రకాష్ గౌడ్, ఎంపీ రంజిత్ రెడ్డి. మనంసైతంకు తాము కూడా అండగా ఉంటామని వారు ప్రకటించారు. మనం సైతం సభ్యులు వల్లభనేని అనిల్, రమేష్ వర్మ, శ్రీధర్ రెడ్డి, వినోద్ బాల, చిత్రపురి కాలనీ పెద్దలు మహానంద రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి తదితరులు కార్యక్రమాన్ని నడిపించారు. ఈ సందర్భంగా మెడికవర్, నేత్రాలయా ఆస్పత్రుల సిబ్బంది కార్మికులకు వైద్యపరీక్షలు నిర్వహించి తగిన మందులు అందజేశారు.

Manam Saitham Free Medical Camp at Chitrapuri Colony:

JD Lakshminarayana praises Kadambari Kiran Manam Saitham
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs