Advertisement

‘మన్మథుడు 2’ అసలు మ్యాటరేంటి?


నాగార్జునకి ఆయన ఫ్రెండ్ రామ్ గోపాల్ వర్మ ఆఫీసర్ సినిమాతో కోలుకోలేని డిజాస్టర్ ఇచ్చాడు. రామ్ గోపాల్ వర్మ ఫామ్ లో లేని టైం లో నాగార్జున, వర్మని నమ్మి ఆఫీసర్ చేసాడు. అసలా సినిమా నాగ్ ఎందుకు చేసాడో ఎవ్వరికి అర్ధమే కాలేదు. ఇక నానితో కలిసి నాగార్జున దేవదాస్ సినిమా చేసాడు. దేవదాస్ కూడా యావరేజ్ గానే ఆడింది కానీ.. హిట్ కాలేదు. తాజాగా చి.ల.సౌ తో ఆకట్టుకున్న రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున మన్మథుడు 2 సినిమా చేసాడు. కథ మీద నమ్మకంతో తానే స్వయంగా ఈ సినిమాని నిర్మించాడు. శుక్రవారం వరల్డ్ వైడ్ గా మంచి అంచనాలతో విడుదలైన మన్మథుడు2కి పేక్షకులు కాదు... క్రిటిక్స్ కూడా యావరేజ్ టాక్ తో యావరేజ్ మార్కులే వేశారు.

Advertisement

నాగార్జున నటనకు, రకుల్ ప్రీత్ గ్లామర్ కి సినిమాటోగ్రఫీకి, నేపధ్య సంగీతానికి, వెన్నెల కిషోర్ కామెడీకి ప్లస్ పాయింట్స్ దక్కితే... పాటలు, సెకండ్ హాఫ్ లో కామెడీ లేకపోవడం, క్లైమాక్స్ విషయంలో మన్మథుడు 2కి నెగిటివ్ మార్కులు పడ్డాయి. ఇక దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కూడా సినిమా స్క్రిప్ట్ మీద తన మార్క్ చూపలేకపోయాడు. చి.ల.సౌ లో ఉన్ననేచురాలిటీ.. మన్మథుడు 2 లో మిస్ అయిందంటున్నారు. అలాగే కామెడీ కూడా అంతగా లేకపోవడంతో వేరే సినిమా రీమేక్ మీద రాహుల్ పట్టు  సాధించలేకపోయాడంటున్నారు. ఇక రకుల్ గ్లామర్ గా ఆకట్టుకున్నప్పటికీ.. వెన్నెల - నాగ్ మధ్య కాంబో సీన్స్ నవ్వించినా.. సినిమాలో పస లేకపోవడంతో ప్రేక్షకులు బోర్ ఫీల్ అయ్యారు. గతంలో వచ్చిన మన్మథుడు సినిమాని దృష్టిలో పెట్టుకుని ఈ మన్మధుడు 2 కి వెళితే ప్రేక్షకుడు మోసపోయినట్లే. సినిమా క్లైమాక్స్ కూడా అంతగా మెప్పించలేకపోయిందని అంటున్నారు.

Manmadhudu 2 gets Negative Talk at Box Office:

Nagarjuna gets one More Flop with Manmadhudu 2
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement