Advertisement
Google Ads BL

‘మన్మథుడు 2’‌ని నమ్ముకుంది.. కానీ ఏం లాభం?


రకుల్ ప్రీత్‌కి తెలుగులో ఉన్న ఏకైన సినిమా ‘మన్మథుడు 2’. ఇప్పుడు మన్మథుడు 2 కూడా ప్రేక్షకులముందుకు వచ్చేసింది. నిన్న వరల్డ్ వైడ్‌గా విడుదలైన మన్మథుడు 2 కి ప్రేక్షకులు యావరేజ్ టాక్ ఇచ్చారు. రాహుల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్, నాగ్ సరసన టీనేజ్ అమ్మాయిలా నటించింది. మన్మథుడు 2లో రకుల్ ప్రీత్, నాగార్జునకి అద్దెకొచ్చిన లవర్ అవంతిక పాత్రలో నటించింది. ఏజెడ్ హీరో నాగ్ సరసన రకుల్ టీనేజ్ అమ్మాయిగా బాగానే సెట్ అయ్యింది. అయితే సినిమాకొచ్చిన టాక్ వలన రకుల్ కి ఏం ఒరుగుతుందో తెలియని పరిస్థితి.

Advertisement
CJ Advs

అయితే ఈ సినిమాలో నటన పరంగా నాగార్జున కన్నా రకుల్ ప్రీత్ సింగ్‌కే ఎక్కువ మార్కులు పడతాయి. తొలిసగంలో అందాలు ఆరబోసినా.. టీనేజ్ అమ్మాయిగా కవ్వించే చూపులు విసిరినా.. క్లైమాక్స్‌లో ఎమోషన్ బాగా పండించింది. రకుల్ బోల్డ్ లుక్స్.. యాక్టింగ్‌తో ఓకే అనిపించింది. గత సినిమాలతో పోలిస్తే రకుల్ భిన్నంగా కనిపించిందీ సినిమాలో. అయితే అవంతిక పాత్ర తేలిపోవడంతో రకుల్ ప్రత్యేకమైన ముద్ర వేయలేకపోయింది. 

పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్ర కాకపోయినప్పటికీ పర్వాలేదనిపించింది. ఇక సినిమాలో నాగార్జున‌తో రకుల్ కెమిస్ట్రీ కూడా పరవాలేదనిపిస్తుంది. మరి ప్రస్తుతం తెలుగులో ఏం సినిమాలు కూడా రకుల్ చేతిలో లేవు. తమిళనాట మాత్రం రెండు సినిమాల్లో రకుల్ నటిస్తుంది. ఇక మన్మథుడు 2 కూడా హిట్ కాకపోయేసరికి ఇపుడు రకుల్ పరిస్థితి ఏమిటా అని అందరూ తెగ చర్చించేస్తున్నారు.

Rakul Preet Singh Disappointed with Manmadhudu 2:

Negative talk to Manmadhudu 2 at Box Office
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs