Advertisement
Google Ads BL

ఆ క్రికెటర్ బయోపిక్ ఆగిపోయిందా?


విజయ్ సేతుపతి క్రేజ్ ఈ మధ్యన స్టార్ హీరోలతో సమానంగా కనిపిస్తుంది. చిన్న పెద్ద సినిమాలంటూ చూడడమే కాదు.... హీరో పాత్రలే కాదు... సినిమాలో కీలకమైన పాత్ర ఏది దొరికిన విజయ్ సేతుపతి వదలడం లేదు. నటుడిగా ఛాలెంజింగ్ పాత్రలకు సై అంటున్న విజయ్ సేతుపతి... తెలుగులో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ఉప్పెన సినిమాలో విలన్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇక విజయ్ సేతుపతి విలన్ రోల్ అంటే ఆ సినిమాకి మాములుగా క్రేజ్ ఉండదు. అయితే కొన్ని రోజులనుండి విజయ్ సేతుపతి, వైష్ణవ్ తేజ్ ఉప్పెన నుండి తప్పుకున్నాడని ప్రచారం జరుగుతుంది.

Advertisement
CJ Advs

తాజాగా విజయ్ సేతుపతి మరో మూవీ నుండి తప్పుకున్నాడనే ప్రచారం మొదలైంది. అది కూడా ఓ లెజెండరీ క్రికెటర్ బయోపిక్ నుండి అంటున్నారు. విజయ్ సేతుపతి హీరోగా శ్రీలంక లెజెండరి క్రికెటర్, ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ని టాలీవుడ్ హీరో రానాతో పాటు కోలీవుడ్ నిర్మాతలు నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎప్పుడో సినిమా మీద అధికారిక ప్రకటన కూడా వచ్చింది. త్వరలోనే ముహూర్తం పెట్టుకోనున్న ఈ మూవీ నుండి విజయ్ సేతుపతి తప్పుకున్నట్లుగా సమాచారం. ఆయన క్రేజ్ కి ఈ సినిమా చేస్తే బావుండేదని విజయ్ అభిమానులు అభిప్రాయపడుతున్నారట. అంతేకాకుండా హీరో రానా కూడా ఈ సినిమా బడ్జెట్ పరిమితికి మించి ఉండడంతో రానా కూడా పునరాలోచనలో పడినట్లుగా టాక్. మరి సచిన్ లాంటి క్రికెటర్ గెస్ట్ రోల్ అంటే ఆ సినిమా రేంజ్ ఓ రేంజ్ లో ఉండాలి అంటే అధిక బడ్జెట్ కంప్లసరి. మరి అటు విజయ్, ఇటు రానా కూడా ఆలోచనలో పడుతున్నారంటే.. అసలా సినిమా ఉంటుందా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

Rumours on Muralidharan Biopic:

Vijay Sethupathi Out from Muttaiah Muralidharan Biopic
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs