Advertisement
Google Ads BL

పూరి-దేవరకొండ ఓకే.. ఛార్మీ సంగతేంటి?


ఇస్మార్ట్ శంకర్ లాంటి సూపర్ హిట్ చిత్రం తరువాత పూరి ఏ సినిమా చేస్తాడు అని అందరిని వెంటాడుతున్న ప్రశ్న. ఇస్మార్ట్ తరువాత పూరి విజయ్ దేవరకొండతో ఓ మూవీ చేయాలనీ నిర్ణయించుకున్నట్టు టాక్. అధికారంగా వీరి కాంబినేషన్ లో సినిమా ఏంటి అనేది బయటికి రాలేదు కానీ పూరి - విజయ్ ల మధ్య ఆల్రెడీ మాటలన్నీ అయిపోయాయ్‌. 

Advertisement
CJ Advs

అయితే ఇక్కడ పెద్ద ప్రశ్న ఏంటంటే ఏ ప్రొడ్యూసర్ తో విజయ్ సినిమా చేస్తాడు అని. నిజానికి పూరి సినిమా చేస్తున్నాడు అంటే తన సొంత బ్యానర్ లోనే సినిమాని నిర్మిస్తాడు. ఎందుకంటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా అతనే భరించాలి కాబట్టి. టేకింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదని పూరి తన సొంత బ్యానర్ లో సినిమాలు నిర్మించుకుంటాడు. కానీ విజయ్ దేవరకొండ ఇంతకుముందే పలువురు నిర్మాతల దగ్గర అడ్వాన్స్‌లు తీసుకున్నాడు. లెక్క ప్రకారం వారితోనే ముందుగా సినిమా చేయాలి. 

కానీ పూరి మాత్రం బయట బ్యానర్ లో సినిమా చేసే ఆలోచనలో లేడు. పైగా పూరి నిర్మించే ప్రతి సినిమాకి ఛార్మి కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. ఒకవేళ విజయ్ తో సినిమా చేయాల్సి వచ్చి బయట నిర్మాత అయితే అప్పుడు ఛార్మి పరిస్థితి ఏంటి? ఒకవేళ ఇద్దరూ కలిసి నిర్మించాలని నిర్ణయించినా అందుకు ఇరు వర్గాలు అంగీకరిస్తాయా? మరి ఈ మ్యాటర్ ఎప్పటికి తేలుతుందో చూడాలి. అయినా ఈమూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మాత్రం క్లారిటీ లేదు. ప్రస్తుతం విజయ్ క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్నాడు. అలానే సందీప్ వంగ డైరెక్షన్ లో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

Problem to Charmi with Puri and Vijay Deverakonda Film:

Puri Jagan and Vijay Deverakonda combo.. Problem to charmi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs