Advertisement
Google Ads BL

తెలుగు యువకుడికి జాతీయ అవార్డు


సుధాకర్ రెడ్డికి జాతీయ అవార్డు.. ‘నాల్’కు జ్యూరీ ఫిదా తెలుగు దర్శకులు జూలు విదిలిస్తున్నారు. కొత్త దర్శకులు తెలుగు సినీ పరిశ్రమలో కొత్త బాటలు వేస్తున్నారు. ఇతర భాషల్లోనూ సత్తా చాటుతున్నారు. రొటీన్ ఫార్ములా చిత్రాలకు భిన్నంగా భావోద్వేగాలను అత్యంత సహజంగా తెరకెక్కిస్తూ ప్రేక్షకులకు కొత్త లోకాన్ని పరిచయం చేస్తున్నారు. అవార్డులనూ కొల్లగొడుతున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మరాఠీ చిత్రం ‘సైరాట్’కు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన సుధాకర్ రెడ్డి యక్కంటి ప్రతిష్టాత్మక జాతీయ అవార్డును కైవసం చేసుకున్నారు. ఈ రోజు ప్రకటించిన 66వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఆయన ‘ఇందిరాగాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు అవార్డు’కు ఎంపికయ్యారు.

Advertisement
CJ Advs

జాతీయ అవార్డులను ఈ రోజు ఢిల్లీలో ప్రకటించారు. ఉత్తమ నూతన దర్శకుడి అవార్డు కోసం పలు చిత్రాలను పరిశీలించిన జ్యూరీ.. మరాఠీ చిత్రం ‘నాల్’ దర్శకుడు సుధాకర్ రెడ్డి యక్కంటిని ఎంపిక చేసింది. బాల్యంతో పెనువేసుకున్న అనుభవాలను, ముఖ్యంగా తల్లితో కొడుకుకు ఉండే అనుబంధాన్ని ఈ చిత్రంలో సుధాకరెడ్డి ఉద్వేగభరితంగా చూపారు.  ప్రతి మనిషినీ నాల్(బొడ్డుతాడు) తన బాల్యంలోకి, గ్రామంలోకి, తన చేదు, తీపి అనుభూతుల్లోకి వెళ్లే వైనాన్ని దృశ్యకావ్యంగా మలిచారు. దర్శకుడుకి కెమెరాపై గట్టి పట్టు ఉండడంతో ప్రతి దృశ్యం వెండితెరపై అబ్బురంగా పరచుకుంది. పల్లెపట్టు అందాలు, పిల్లల అల్లరి, సామాన్యుల బతుకు పోరాటాలను కొత్తగా పరిచయం చేశారు. గుంటూరుకు చెందిన సుధాకర్ రెడ్డి యక్కంటి జేఎన్టీయూలో డిగ్రీ పూర్తి చేశారు. పుణేలోని ప్రఖ్యాత ఎఫ్టీఐఐలో పీజీ పట్టా పుచ్చుకున్నారు. ‘మధుమాసం’, ‘పౌరుడ’, ‘దళం’ తదితర టాలీవుడ్ చిత్రాలకు పనిచేశాక ముంబైలో స్థిరపడ్డారు. హిందీ, మరాఠీ చిత్రాల్లో బిజీగా ఉంటూనే ‘నాల్’ చిత్రాన్ని తెరకెక్కించారు.

నాల్ కుర్రాడికీ అవార్డు..

నాల్ చిత్రంలో ప్రధాన పాత్ర చైతన్యగా నటించిన బాలనటుడు శ్రీనివాస్ పోకలేకు కూడా జాతీయ వేదికపై గుర్తింపు దక్కింది. అతనికి మరాఠీ విభాగంలో ఉత్తమ బాలనటుడు అవార్డును ప్రకటించారు. తల్లీబిడ్డల అనుబంధాలను శ్రీనివాస్, తల్లి పాత్ర పోషించిన దేవిక అద్భుతంగా కళ్లకు కట్టారు.

National Award to Telugu Filmmaker :

Telugu Filmmaker Sudhakar Reddy Yakkanti  has won the National Award
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs