అనసూయ బుల్లితెర హాట్ యాంకర్. పెళ్ళైనా ఇప్పటికీ అనసూయని ఆరాధించే వారు కోకొల్లలు. మరి హీరోయిన్స్ చాలామంది మడికట్టుకుని... అందాల ఆరబోతలో ఆలోచిస్తారు కానీ.. పెళ్ళై పిల్లలున్న అనసూయ మాత్రం అందాల ఆరబోతకు ఆలోచనే చెయ్యదు. ఎలా కావాలంటే అలా చూపించేస్తుంది. ఇక బుల్లితెర మీద హాట్ హాట్ యాంగిల్స్ లో చంపేసే అనసూయ సోషల్ మీడియాలోనూ ఏ మాత్రం తగ్గదు. ఇక వెండితెర మీద మాత్రం కాస్త స్కోప్ ఉన్న పాత్రలు, డి గ్లామర్ పాత్రలే దొరుకుతున్నాయి అనసూయకి . ఓ క్షణం, ఓ రంగస్థలం, తాజాగా కథనం సినిమా. కథనం సినిమాలో అనసూయ లీడ్ రోల్ పోషించింది. ఈ సినిమా ఈ రోజే విడుదలైంది.
అయితే సినిమా మొత్తం అనసూయ కీలక పాత్ర కాబట్టి ప్రమోషన్స్ లో అనసూయ తప్ప కథనం డైరెక్టర్ గాని, అందులో నటించిన ధనరాజ్, వెన్నెల కిషోర్, అవసరాల శ్రీనివాస్ లు కనిపించ లేదు. కేవలం అనసూయ కథనం కర్త, కర్మ, క్రియ అన్నట్టుగా ప్రమోషన్స్ లో హాట్ హాట్ అందాలతో చెలరేగిపోయింది. ఇక అనసూయ ప్రమోషన్స్ మాత్రమే చాలనుకున్నట్లుగా ఉన్నారు. అనసూయ 12 కథలను రిజెక్ట్ చేసి మరీ కథనాన్ని చేసానని చెబుతుంది. మరి నాగార్జున మన్మథుడు 2 తో పోటీపడుతున్న కథనం టాక్ మరికాసేపట్లో తెలిసిపోతుంది. ఇక సినిమా హిట్ అయితే మళ్ళీ అనసూయ తన ప్రమోషన్స్ తో సినిమాని ఇంకా ప్రమోట్ చేస్తుంది. లేదు సినిమా టాక్ తేడా కొడితే అనసూయ అందరిమీద తోసేసి సైలెంట్ అవుతోందో చూద్దాం.