Advertisement
Google Ads BL

చంద్రబాబుపై ఒట్టు.. సాంగ్ రిలీజ్ చేస్తున్నా!!


టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ.. కొన్ని రోజుల క్రితం ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. అప్పుడెప్పుడో ఈ మాట చెప్పిన ఆర్జీవీ ఆ తర్వాత బోలెడన్ని సినిమా ప్రకటనలు చేశారు.. కొన్నటింటికి టైటిల్స్ కూడా చెప్పేశారు. అయితే కడప రెడ్లు అనేది టైటిల్ వివాదాస్పదంగా ఉండటంతో బహుశా ఇది పట్టాలెక్కకపోవచ్చని అందరూ భావించారు.

Advertisement
CJ Advs

అబ్బే అదేం లేదు నేను తలుచుకుంటే ఏదైనా సాధిస్తానంతేనంటూ ఆర్జీవీ ప్రకటిస్తూ.. తాజాగా ట్వి్ట్టర్‌ వేదికగా శుక్రవారం ‘ది మోస్ట్ నాన్ కాంట్రవర్షియల్ ఫిలిం ‘‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’’ సినిమా ఫస్ట్ సాంగ్  ట్రైలర్ రిలీజ్ చేస్తానని ప్రకటించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై ఆర్జీవీ ఒట్టేశారు. ‘ఇది నిజంగా అసలు వివాదాస్పదం కాని కథ.. చంద్రబాబుపై ఒట్టు.. ఇవాళ 9 గంటలకు రిలీజ్ సాంగ్ ట్రైలర్ రిలీజ్ ఉంటుంది’ అని ఆర్జీవీ స్పష్టం చేశారు.

దీంతో.. సినిమా అప్పుడే ఆర్జీవీ షురూ  చేసేసి ఉంటారని తెలుస్తోంది. కాగా ఆ సాంగ్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే మరి. ఇదిలా ఉంటే.. 2019 ఎన్నికల్లో టీడీపీ సైకిల్ తుక్కుతక్కవ్వగా.. వైసీపీ ఫ్యాన్ 151 స్పీడ్‌తో ఏపీ మొత్తం దుమ్మురేపిన విషయం విదితమే. ఈ క్రమంలో ఆర్జీవీ చేస్తున్న ఈ సినిమా జనాలకు ఏ మాత్రం నచ్చుతుందో మరి.

Ram Gopal Varma Today Releases ‘Kamma Rajyam Lo Kadapa Reddlu’ song trailor:

Ram Gopal Varma Today Releases ‘Kamma Rajyam Lo Kadapa Reddlu’ song trailor
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs