Advertisement
Google Ads BL

‘రాక్షసుడు’తో నా హీరోకి హిట్టు: వినాయక్


‘రాక్షసుడు’ తో సూపర్ హిట్ కొట్టి బెల్లంకొండ శ్రీనివాస్ ఎలాంటి పాత్రనైనా చేయగలడు అని నిరూపించుకున్నాడు - సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ వి.వి వినాయక్.

Advertisement
CJ Advs

యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ కథానాయకుడిగా ఏ స్టూడియోస్‌, ఎ హవీష్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై ప్రముఖ విద్యావేత్త కోనేరు సత్యనారాయణ నిర్మాతగా రూపొందిన చిత్రం ‘రాక్షసుడు’. అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌. అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ నామా ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్‌ 2న విడుదల చేశారు. సినిమా సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా సూపర్‌ హిట్‌ టాక్‌తో సక్సెస్‌పుల్‌గా రన్‌ అవుతోంది. ఈ సందర్భంగా సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్  వి. వి వినాయక్ మీడియాతో మాట్లాడారు.

సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ వి.వి వినాయక్ మాట్లాడుతూ - ‘‘ఈరోజు నేను ఇంట్రడ్యూస్ చేసిన సాయి శ్రీనివాస్ కి హిట్ రావడం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది. సాయి కన్నా నాకు ఇంకా ఎక్కువ ఆనందంగా ఉంది. దానికి కారణమైన రమేష్ వర్మకి బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. అలాగే వాసు గారు సినిమా కోసం చాలా కష్టపడ్డారు . ఆయనకు కూడా నా శుభాకాంక్షలు. అలాగే ఈ సినిమా నిర్మాత కోనేరు సత్యనారాయణ గారు నాకు మంచి సన్నిహితుడు. చాలా మంచి వ్యక్తి. చాలా గొప్ప వ్యక్తి.  వాళ్లబ్బాయి కూడా హీరో అయుండి కూడా ఈ కథకు సాయి అయితే పర్ఫెక్ట్ అని సాయిని ఎంచుకోవడం నిజంగా గొప్ప విషయం. అలాగే సినిమాకు ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా సినిమాకు ఏది అవసరమో అన్ని సమకూర్చి ఒక సూపర్ హిట్ సినిమా చేశారు. అందుకు ఆయనను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అందరూ రీమేక్ చేయడం సులభం అనుకుంటారు. కానీ రీమేక్ చాలా కష్టం. రాక్షసుడు తమిళ్ వెర్షన్ నేను చూశాను. ఆ సినిమాలో లాస్ట్ ఫ్రేమ్ వరకూ ఎక్కడా టెంపో మిస్ అవకుండా రమేష్ వర్మ చాలా జాగ్రతగా తెరకెక్కించారు. ఒక సందర్భంలో రమేష్ వర్మని డైరెక్షన్ వైపు ఎందుకు వచ్చావు అని అడిగాను. దానికి అతను దాదాపు 800 సినిమాలకు డిజైనర్ గా పనిచేసి బోర్ కొట్టి వచ్చాను సర్. అని చెప్పాడు. ఆ సమాధానం నాకు బాగా నచ్చింది. కొంతకాలానికి ఏ పనియైన బోర్ కొడుతుంది. కానీ అతనికి దర్శకత్వం బోర్ కొట్టదు. ఈ బ్యానర్లో ఇంకా మంచి మంచి సినిమాలు రావాలి. రమేష్ పెద్ద డైరెక్టర్ అవ్వాలి. అలాగే సాయితో ఇలాంటి మంచి సినిమాలు తీయాలి. వీరిద్దరిది మంచి కాంబినేషన్. ఈ సినిమాకు వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి నా బెస్ట్ విషెస్ తెలియాజేస్తున్నాను. సాయికి ఇంకా మంచి సూపర్ హిట్ లు రావాలని మనస్పార్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు.

అనంతరం విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ....

మీరు సాయిని కమర్షియల్ యాస్పెక్ట్ లో చూపించారు. కానీ ఈ సినిమాలో స్టోరీ ఓరియంటెడ్ గా చూపించడం ఎలా అనిపిస్తుంది?

- అల్లుడు శీను సినిమాలో సాయిని ఒక కమర్షియల్ హీరోగా చూపించడానికి అవసరమైన అన్ని యాంగిల్స్ చూపించాను. కొన్ని అవసరం లేకపోయినా కథలోకి తీసుకువచ్చి హీరోయిజంని ఎలివేట్ చేయడం జరిగింది. అది ఒక మ్యాజిక్. అది వర్క్ అవుట్ అయింది. మొన్న సురేష్ గారు మాట్లాడుతూ మా అబ్బాయిని ఆర్టిస్టుగా ఈ సినిమాతోనే గుర్తించారు అన్నారు. అది నిజం కాదు సాయిని అన్ని సినిమాల్లోనూ మంచి ఆర్టిస్టుగా గుర్తించారు. లేకపోతే అన్ని సినిమాలు చేయలేడు. సాయి తన ఫస్ట్ సినిమాకే బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. ఈ సినిమాలోకి వచ్చేటప్పటికి  సినిమా  టెంపో ఎక్కడా తగ్గకుండా కథలోకి వెళ్లి నటించాడు. సాయి ఎలాంటి పాత్రని అయినా చేయగలడు. ఫ్యూచర్ లో ఇంకా మంచి పాత్రల్లో కనిపిస్తాడు. 

నటుడిగా సాయిలో మీరు ఎలాంటి మెచ్యూరిటీ గమనించారు?

- సాయి ఫస్ట్ నుండి చాలా మెచ్యూర్ గా ఉండేవాడు. అలాగే ప్రతి సినిమాకు తనని తాను ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు. అప్పటికి ఇప్పటికి నేను అయితే పెద్దగా తేడాలు ఏమి గమనించలేదు. కథకు ఎలా కావాలో అలా చేస్తున్నాడు.

అల్లుడు శీను వచ్చి అయిదు సంవత్సరాలు అయింది కదా?

- నాకైతే  ఆ సినిమా వచ్చి అయిదు సంవత్సరాలు అయింది అంటే నమ్మబుద్ది కావడం లేదు. నిన్న కాక మొన్ననే రిలీజ్ చేసిన ఫీలింగ్ ఉంది.

ఫ్యూచర్ లో సాయితో సినిమా తీసే అవకాశం ఉందా ?

- తప్పకుండా ఉంది. కాకపోతే ఒక పెద్ద సినిమా తీయాలి. దానికి మంచి కథ సెట్ అవ్వాలి.

VV Vinayak Interview about Rakshasudu Movie:

VV Vinayak Talks About Rakshasudu Movie and Movie Team
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs