Advertisement
Google Ads BL

దేవరకొండ వదిలేశాడు.. పూరి ప్రాణం పెట్టాడు


విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ విషయంలో ఒకటి అనుకుంటే మరొకటి జరిగింది. భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన డియర్ కామ్రేడ్‌ని విజయ్ దేవరకొండ అతి జాగ్రత్తలతో రీ షూట్స్ చేయించినా వర్కౌట్ కాలేదు. విజయ్ ప్లాప్ చిత్రం నోటా విషయంలో జరిగిన తప్పులు డియర్ కామ్రేడ్ విషయంలో జరక్కూడదని విజయ్ చాలా ఆలోచించాడు కానీ... ఇక్కడా అదే జరిగింది. ఇక సినిమాకి ముందు ప్రమోషన్స్‌తో తెగ హడావిడి చేసిన విజయ్ దేవరకొండ.. సినిమా విడుదలై యావరేజ్ టాక్ వచ్చాక సినిమా ప్రమోషన్స్‌ని పక్కన పడేసాడు. అందుకే మొదటి వారానికే డియర్ కామ్రేడ్ సర్దేసుకుని.. బ్రేక్ ఈవెన్ రాకుండా ఉసూరుమంది.

Advertisement
CJ Advs

కానీ పూరి - రామ్ సినిమా ఇస్మార్ట్ శంకర్‌కి కూడా ముందు యావరేజ్ టాకే పడింది. ఇస్మార్ట్ టీం సినిమా విడుదలయ్యాక కూడా పిచ్చగా సినిమాని ప్రమోట్ చేసింది. డియర్ కామ్రేడ్ వస్తే మాకేంటి అంటూ ఇస్మార్ట్ ప్రమోషన్స్‌ని ఊరూరా చేసింది. అందుకే సినిమా హిట్ అయ్యి భారీ కలెక్షన్స్ వచ్చాయి. మరి విజయ్ దేవరకొండ కూడా డియర్ కామ్రేడ్ ని అలా కాలేజీలలోను, థియేటర్స్ లోను భారీగా ప్రమోట్ చేసి ఉంటే.. నిర్మాతలకు లాభాలు రాకపోయినా.. కనీసం నష్టాలన్నా తప్పేవి. కానీ విజయ్ డియర్ కామ్రేడ్ కొచ్చిన టాక్ చూసి సైలెంట్ అయ్యాడు. 

ఇక తాజాగా క్రాంతి మాధవ్ సినిమా విషయంలో విజయ్ మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని డిసైడ్ అయ్యాడట. ఎందుకంటే తన మరో భారీ బడ్జెట్ మూవీ హీరో సినిమా డోలాయమానంలో పడడంతో విజయ్ ఇప్పుడు ఆచితూచి అడుగులేస్తున్నట్టుగా చెబుతున్నారు. మరో పక్క విజయ్ దేవరకొండ.. దర్శకుడు పూరితో సినిమాకి కమిట్ అయ్యాడనే న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ప్రచారం జరుగుతుంది. మరి ఇది నిజమా.. కాదా.. అనేది విజయ్ గానీ, పూరి గాని స్పందిస్తేనే స్పష్టత వస్తుంది. 

Vijay Deverakonda and Puri Stand on Dear Comrade and Ismart Shankar:

Ismart Shankar hit and Dear Comrade average at Box Office
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs