Advertisement
Google Ads BL

‘మన్మథుడు 2’ రకుల్ వర్సెన్ ‘కథనం’ అనసూయ


రేవు శుక్రవారం విడుదల కాబోతున్న ‘మన్మథుడు 2, కథనం’ సినిమాల మీద ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఉంది. నాగార్జున - రకుల్ ప్రీత్ కాంబోలో తెరకెక్కిన మన్మథుడు 2 సినిమాని రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించాడు. గతంలో నాగార్జున నటించిన మన్మథుడు సినిమా సూపర్ హిట్ అయ్యింది. అందులోని త్రివిక్రమ్ రాసిన పంచ్ లు పటాస్ లా పేలాయి. ఇక ఇప్పుడు మన్మథుడు 2 కోసం కూడా  రాహుల్ అలాంటి కామెడీనే తీసుకున్నాడట. కమెడియన్ వెన్నెల కిషోర్ పాత్రని బాగా హైలెట్ చేస్తూ కామెడీ రాసుకున్నాడట. ఇక నాగార్జున కూడా ఈ సినిమాలో వయసుని లెక్కలోకి తీసుకోకుండా అమ్మాయిలతో జాలిగా తిరుగుతూ రెచ్చిపోయే పాత్రలో నటించాడు. ఇక రకుల్ మందు కొడుతూ సిగరెట్ తాగుతూ ఏ సర్టిఫికెట్ చూపిస్తానని చెప్పింది. అలాగే రకుల్ ప్రమోషన్స్ పరంగా హాట్ హాట్ డ్రెస్సులతో హాట్ హాట్ ఫోజులతో రెచ్చిపోతుంది. రకుల్ రోజుకో హాటెస్ట్ డ్రెస్‌తో మన్మథుడు 2 ప్రమోషన్స్‌లో పాల్గొంటుంది. రకుల్ వేస్తున్న హాటెస్ట్ డ్రెస్‌లతో ఆమె అందం మరింత కాంతివంతమైంది.

Advertisement
CJ Advs

ఇక మరో సినిమా ‘కథనం’ కథానాయకురాలు అనసూయ భరద్వాజ్ కూడా తన సినిమాని బాగా ప్రమోట్ చేస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన కథనం సినిమాతో అనసూయ నాగార్జునతో పోటీకి సై అంటుంది. అనడమేనా కథనం ప్రమోషన్స్ లో హాట్ హాట్ గా రెచ్చిపోతుంది. పెళ్ళై పిల్లలున్నా హీరోయిన్స్ కుండాల్సిన అందం అనసూయకుంది. మరీ హాట్ గ్లామర్ పాత్రలు రాకపోయినా... సినిమాల్లో లీడ్ కేరెక్టర్స్ ఆమె సొంతమవుతున్నాయి. గతంలో క్షణం సినిమాలో ఖతర్నాక్ పోలీస్ ఆఫీసర్‌గా నటించిన అనసూయ కథనంలోనూ లీడ్ రోల్ చేసింది. ఇక కథనం ప్రమోషన్స్ కోసం రోజుకో ఫ్రాక్ లో అనసూయ సోషల్ మీడియాని ఓ ఊపు ఊపుతుంది. అటు మన్మథుడు 2 ప్రమోషన్స్‌లో రకుల్ గ్లామర్‌గా రెచ్చిపోతుంటే.. ఇటు కథనం ప్రమోషన్స్ కోసం అనసూయ రకుల్‌కి గట్టి పోటీనిస్తుంది.

Manmadhudu 2 Rakul Preet Singh vs Kathanam Anasuya:

Rakul Preet and Anasuya Hot Promotions for Manmadhudu 2 and Kathanam
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs