Advertisement
Google Ads BL

అవే నా ఫేవ‌రేట్: మహేష్ బాబు


స్పాయిల్‌తో కలిసి ‘హంబుల్ కో’ న్యూ క్లోతింగ్ బ్రాండ్‌ను ప్రారంభించిన సూప‌ర్‌స్టార్ మహేష్ 

Advertisement
CJ Advs

సూపర్ స్టార్ మహేష్ ఒక పక్క సినిమాలతో బిజీగా ఉంటూనే మరో వైపు వ్యాపార రంగంలోనూ తన సత్తా చాటుతున్నారు. ఈ మధ్యనే మల్టీప్లెక్స్‌ రంగంలోకి అడుగుపెట్టి గచ్చిబౌలిలో విలాసవంతమైన ‘ఏఎమ్‌బీ’ సినిమాస్‌ పేరుతో ఓ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ స‌రికొత్త వ‌స్త్ర ప్ర‌పంచంలోకి మ‌నల్ని తీసుకెళ్ల‌నున్నారు. స్పాయిల్‌తో క‌లిసి ఆయ‌న ప్రారంభించిన క్లాత్ బ్రాండ్ ‘ది హంబుల్ కో’ బుధ‌వారం అధికారికంగా ప్రారంభ‌మైంది. నేష‌న‌ల్ హ్యాండ్ లూమ్ డే సంద‌ర్భంగా హంబుల్ అండ్ కో ప్రారంభించారు మహేష్. హంబుల్ అండ్ కోలో 160 ర‌కాల స్టైల్స్‌కి సంబంధించిన దుస్తులు రూ.599 ల నుండి లభ్యమవనున్నాయి. వీటిలో కొన్నింటిని మోడల్స్ స్టేజ్‌పై ప్ర‌ద‌ర్శించారు. ఈ ప్రకటనకు ముందు మహేష్ టీమ్ ఓ ఆసక్తికర కాంటెస్ట్ నిర్వహించింది. మూడురోజుల కౌంట్ డౌన్‌తో ఫ్యాన్స్‌ని మహేష్ చేయనున్న బిజినెస్ గెస్ చేయండి అని ఓ పజిల్ నిర్వహించగా అభిమానులు పెద్ద ఎత్తున స్పందించారు. కాగా వారిలో లక్కీ డిప్ ద్వారా ఐదుగురు అదృష్టవంతులకు మహేష్ ని కలిసే అవకాశం దక్కింది. ఈ కార్య‌క్ర‌మంలో స్పాయిల్ సి.ఇ.ఒ భార్గ‌వ్ ఎర్రంగి, స్పాయిల్ ప్రైవేట్ బ్రాండ్ డివిజ‌న్ హెడ్ సుశ్రితి కృష్ణ పాల్గొన్నారు.

సూపర్ స్టార్ మహేష్ మాట్లాడుతూ.. ‘‘హంబుల్ క్లోతింగ్ కలెక్షన్ నా పర్సనాలిటీ, స్టైల్‌ని ప్రతిబింబించేలా ఉంటుంది. సింపుల్ గా, డౌన్ టు ఎర్త్ ఉండడానికే నేను ఇష్టపడతాను. హంబుల్ లో అదే కనిపిస్తుంది. దీని ద్వారా ఫాన్స్‌తో నా బంధం మరింత దృఢపడుతుందని భావిస్తున్నాను..’’ అన్నారు.   

స్పాయిల్ సి.ఇ.ఒ భార్గ‌వ్ ఎర్రంగి మాట్లాడుతూ.. ‘‘సూపర్ స్టార్ మహేష్‌తో కలిసి మైక్రో లెవెల్ క్లోతింగ్ బ్రాండ్ హంబుల్ కో లో భాగమైనందుకు సంతోషంగా ఉంది. మహేష్ గారు సింప్లిసిటీ, హుంబుల్ పర్సన్. ఆయన స్టైల్‌ను ఈ బ్రాండ్ రిఫ్లెక్ట్ చేస్తుంది. మహేష్ ఇచ్చే విలువైన డైరెక్షన్స్ కోసం మా టీం అందరూ వెయిట్ చేస్తున్నారు. సోషల్ కామర్స్ బిజినెస్ లో ఒక మంచి సెలబ్రిటీ బ్రాండ్ గా హుంబుల్ కో నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు’’ అన్నారు.

స్పాయిల్ ప్రైవేట్ బ్రాండ్ డివిజ‌న్ హెడ్ సుశ్రితి కృష్ణ మాట్లాడుతూ.. ‘‘మహేష్ తో కలిసి అసోసియేట్ అవడం హ్యాపీగా ఉంది. హుంబుల్ కో రూట్ లెవెల్ కలెక్షన్స్ ద్వారా కమ్యూనిటీస్ రిబిల్డ్ అవుతాయని నమ్ముతున్నాం. చేనేత కార్మికులకు ప‌నిని క‌ల్పించేలా న్యాచురల్ డైస్, నాణ్యమైన ఫాబ్రిక్స్ తో తయారయ్యే దుస్తులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాం’’ అన్నారు.

 

ఈ సంద‌ర్భంగా మ‌హేశ్ పాత్రికేయుల ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మిచ్చారు.

నిజ జీవితంలో మీరెలాంటి దుస్తులు ధరించడానికి ఇష్టపడతారు? మీ ఫేవరెట్ స్టైల్ ఏంటి?

- నేను చాలా కంఫ‌ర్ట్‌గా ఉండే దుస్తుల‌ను ధ‌రించ‌డానికే ప్రాధాన్య‌త ఇస్తాను. జీన్స్ ప్యాంట్‌, చెక్స్ ష‌ర్ట్‌ను ఎక్కువ‌గా ధ‌రిస్తుంటాను. మ‌న రెండు తెలుగు రాష్ట్రాల‌కు సంబంధించిన చేనేత కార్మికులకు ప‌నిని క‌ల్పించేలా ఉండే దుస్తులే ధ‌రించ‌డానికి ఎక్కువ ఇష్ట‌ప‌డ‌తాను. అవే నా ఫేవ‌రేట్‌.

హంబుల్ అంటే అర్థ‌మేంటి? స్పాయిల్‌తో ఎలా అసోసియేట్ అయ్యారు?

-  హంబుల్ అంటే నిజంగా ఉండ‌టం...విన‌యంగా ఉండ‌టం. క్లాత్ బిజినెస్‌లోకి రావాల‌నే ఆలోచ‌న అని కాకుండా ఏదైనా కొత్త‌గా చేయాల‌ని ఆలోచ‌నైతే ఉండింది. ఆ స‌మ‌యంలో భార్గ‌వ్ న‌న్ను క‌లిశారు. ఆయ‌న విజ‌న్ న‌చ్చ‌డ‌మే కాదు.. ఎగ్జ‌యిటెడ్‌గా కూడా అనిపించింది. 

ఎ.ఎం.బి సినిమా త‌ర్వాత హంబుల్ స్టార్ట్ చేశారు. త‌ర్వాత ఏం స్టార్ట్ చేయ‌బోతున్నారు?

- మ‌న‌సులో చాలానే ఉన్నాయి. అయితే సినిమాల్లో న‌టించ‌డానికి నేను ముందు ప్రాధాన్య‌త‌నిస్తాను. నా పుట్టిన‌రోజుకి రెండు రోజుల ముందు సోష‌ల్ మీడియాలో నా అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు. ఇలాంటి అభిమానులున్నందుకు నేనెంతో అదృష్ట‌వంతుడిని. 

మీరు బ‌య‌ట ఎవరి స్టైల్‌నైనా ఇష్టపడతారా? మీ ఫేవరేట్ స్టైల్ ఏంటి?

- చూడ‌గానే రియ‌ల్‌గా అనిపించే ఏ స్టైల్‌ను అయినా నేను ఇష్ట‌ప‌డ‌తాను. నా ఫేవరేట్ కలర్ బ్ల్యూ చెక్స్ అండ్ జీన్స్ .

జాతీయ చేనేత కార్మికుల దినోత్స‌వం రోజున హంబుల్‌ను స్టార్ట్ చేయ‌డం ఎలా అనిపిస్తుంది?

- చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓ మంచి రోజున మా హంబుల్‌ను స్టార్ట్ చేయ‌డం ఎగ్జ‌యిటింగ్‌గానే అనిపిస్తుంది. భార్గ‌వ్‌, సుశ్రిత‌కు అందుకు థ్యాంక్స్‌. 

హంబుల్ పేరు విన‌గానే ఫస్ట్ మీకు ఎలా అనిపించింది?

- నిజానికి భార్గ‌వ్ వ‌చ్చి ఆలోచ‌న చెప్పగానే న‌చ్చింది. ఆయ‌న హంబుల్ అనే పేరు చెప్ప‌గానే క‌నెక్ట్ అయిపోయాను. నా ప‌ర్స‌నాలిటీకి ద‌గ్గ‌ర‌గా ఉంటుంద‌ని ఫీల‌య్యాను. హంబుల్‌లో ఎం,బి అనే అక్ష‌రాలు ప‌క్క ప‌క్క‌నే ఉన్నాయ‌ని అనుకోలేదు. వాటిని గ‌మ‌నించిన మా గ్రాఫిక్స్ టీం వాటిని అండ‌ర్ లైన్ చేసింది.

Mahesh Babu New Business The Humbl Co Launched:

Superstar Mahesh Launches New CLothing Brand ‘THE HUMBL CO’ Along With Spoyl
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs