Advertisement
Google Ads BL

‘తమన్నా’ను భయపెడుతున్న ‘తమన్నా’!


అదేంటి తమన్నాను.. తమన్నా భయపెట్టడమేంటి..? అని ఆశ్చర్యపోతున్నారా..? అవును మీరు వింటున్నది నిజమే. మీరు అనుకుంటున్నట్లుగా పైన చెప్పిన ఇద్దరూ ఒకటి కాదు.. ఇద్దరూ ఇద్దరే.. వారిలో ఒకరు మిల్క్‌బ్యూటీ తమన్నా అయితే మరొకరు మాత్రం ట్రాన్స్‌జెండర్ తమన్నా. అదేనండి.. అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కుమారుడి నారా లోకేష్‌పై మంగళగిరి నుంచి పోటీ చేసి హాట్ టాపిక్ అయ్యి.. ప్రస్తుతం బిగ్‌బాస్-3 హౌస్‌లో ఉన్న తమన్నా.

Advertisement
CJ Advs

బిగ్‌బాస్ హౌస్‌లో తమన్నా పేరు మార్మోగుతోంది.. ఆమెపేరు చెబితే మిగతా కంటెస్టెంట్స్ జంకుతున్నారు. ఒక్క హౌస్‌లోనే కాదు నెట్టింట్లో కూడా ఈమె పేరే పెద్ద ఎత్తున వినిపిస్తోంది. ఈమె పేరుతో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో అకౌంట్లు తెగ తెరిచేస్తున్నారు. దీంట్లో అసలు ఒరిజినల్ ఏదో.. ఫేక్ ఏదో.. అసలు మిల్క్ బ్యూటీ తమన్నాది పేజీ ఏదో తెలుసుకోలేక నెటిజన్లు, ఇరువురి ఫ్యాన్స్, సన్నిహితలు కన్ఫూజ్ అవుతున్నారట. అంతేకాదు.. ఒకర్ని పొగడబోయి మరొకర్ని పొగిడేస్తున్నారట.

తమన్నా ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేయాలంటే భయపడుతోందట. ఎవరికో ట్యాగ్ చేయబోయి.. తమన్నాకు ట్యాగ్ చేస్తున్నారు. వీటిలో కొందరు బిగ్‌బాస్ ప్రియులు పాజిటివ్ రియాక్ట్ అవుతుంటే మరికొందరు మాత్రం నెగిటివ్ ఇష్టానుసారం మాట్లాడేస్తున్నారట. దీంతో సోషల్ మీడియా జోలికి పోవాలంటే తమన్నాకు తలనొప్పి వస్తోందట. మొత్తానికి చూస్తే.. బిగ్‌బాస్ నుంచి ట్రాన్స్‌జెండర్ తమన్నా ఎలిమినేట్ అయ్యేవరకు మిల్క్ బ్యూటీకి ఈ కష్టాలు తప్పవన్నమాట.

Tamanna Fears with Effect Of Tamanna!:

Tamanna Fears with Effect Of Tamanna!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs