Advertisement
Google Ads BL

‘అతిథి’.. మహేష్ బాబే..!


మహేష్ బాబు ముఖ్య అతిధిగా సెప్టెంబర్ 20న హైదరాబాద్ లో దాదాసాహెబ్ ఫాల్కే సౌత్  అవార్డ్స్ - 2019 గ్రాండ్ ఫంక్షన్

Advertisement
CJ Advs

భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే సౌత్ అవార్డ్స్ 2019కి తెరలేచింది. దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన సినీ ప్రముఖుల్ని ఈ సందర్భంగా సత్కరించనున్నారు. ఈ అద్భుతమైన వేడుకకు హైదరాబాద్ లోని మాదాపూర్, ఎన్ కన్వెన్షన్ వేదిక కానుంది. సెప్టెంబర్ 20న ఈ గ్రాండ్ ఈవెంట్ జరగనుంది. ఈ వేడుకలో మహేష్ బాబు, సమంత, జగపతి బాబు, రకుల్ ప్రీత్ సింగ్, దేవిశ్రీ ప్రసాద్, అనుష్క శెట్టి, బ్రహ్మానందం, నందిత శ్వేత, పాయల్ రాజ్ పుత్, ఛార్మీ కౌర్, పూరీ జగన్నాథ్, లక్ష్మీ మంచు, మోహన్ బాబు వంటీ సినీ సెలెబ్రిటీస్ పాల్గొంటున్నారు. ఇటీవలే బాలీవుడ్ లో ఈ అవార్డుల పండగ అద్భుతంగా జరిగింది. దీంతో హైదరాబాద్ లో జరగబోయే ప్రెస్టీజియస్ దాదాసాహెబ్ సౌత్ అవార్డ్స్ వేడుక కోసం సినీలోకం ఎదురుచూస్తోంది. 

దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలో టాప్ సినీ సెలెబ్రిటీస్, రాజకీయ, వ్యాపార దిగ్గజాలు, ప్రత్యేక అతిథులుగా పాల్గొంటున్నారు. దక్షిణ భారతదేశ చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలందిస్తున్న వారిని ప్రత్యేకంగా సన్మానించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు గ్రాండ్ గా జరుగుతున్నాయి.  

The Dadasaheb Phalke International Film Festival South Details:

Mahesh babu Chief guest to The Dadasaheb Phalke International Film Festival South
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs