‘బాహుబలి’ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ మరో భారీ సినిమా ‘సాహో’తో అభిమానుల ముందకు రాబోతున్నాడు. ఈ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహించగా.. యు.వి క్రియేషన్స్ సంస్థ దాదాపు రూ. 300 కోట్లకుపైగా బడ్జెట్‌తో దీన్ని తెరకెక్కించింది. ఆగస్ట్ 30న థియేటర్లలోకి రానుంది. అయితే ఇప్పటి వరకూ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ సోషల్ మీడియాకు మాత్రమే పరిమితం అయ్యాయి. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా చేయాలని చిత్రబృందం భావిస్తోంది.
ఈ భారీ వేడుకకు రామోజీ ఫిల్మ్ సిటీ వేదిక కానుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెల 18న లేదా 19న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందని సమాచారం. కాగా ఈ ఈవెంట్‌పై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇప్పటికే ముఖ్య అతిథులుగా ఎవరు ఆహ్వానించాలి..? అని సెలక్షన్ చేసే పనిలో చిత్రబృందం నిమగ్నమైందట.
ఇదిలా ఉంటే.. ‘సాహో’తో శ్రద్ధా కపూర్ టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది. భారీ తారాగణంతో, భారీ బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమాపై బాహుబలి కంటే ఎక్కువే అంచనాలు ఉన్నాయి. మరోవైపు ఎప్పుడెప్పుడు సినిమా థియేటర్లలోకి వస్తుందా..? అని ప్రభాస్ అభిమానులు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. కాగా.. తెలుగుతో పాటు తమిళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.