Advertisement
Google Ads BL

వెన్నెల కిషోర్‌కి ఈ రెండూ హిట్టు పడితేనా..?


బ్రహ్మానందం, సునీల్‌లకు అవకాశాలు తగ్గడంతో.. వారి ప్లేస్‌లో వెన్నెల కిషోర్ ఒక్కసారిగా దూసుకొచ్చేసాడు. ‘వెన్నెల’ సినిమాతో వెన్నెల కిషోర్ గా మారిన కమెడియన్ వెన్నెల కిషోర్ కమెడియన్‌గా వరసగా సినిమాలు చేస్తున్నాడు. అలా టాప్ కమెడియన్‌గా వెన్నెల పేరే వినబడుతుంది. కానీ వెన్నెల కామెడీతో హిట్ అయిన సినిమాలేవీ ఈ మధ్యకాలంలో పెద్దగా కనిపించడం లేదు. కానీ దర్శకులకు వెన్నెల కామెడీ ఉంటే సినిమా బావుంటుందని... హీరోలకు ఫ్రెండ్ క్యారెక్టర్స్‌లో వెన్నెలను సినిమాల్లోకి దించుతున్నారు. మరి ప్రస్తుతం సినిమాల్లో కనబడుతున్న ఏకైక స్టార్ కమెడియన్ వెన్నెల కిషోరే. ఇక సునీల్ చెయ్యాల్సిన పాత్రలన్నీ వెన్నల కిషోరే చేస్తున్నాడు. 

Advertisement
CJ Advs

తాజాగా మన్మథుడు 2 లో వెన్నల కిషోర్, నాగార్జునతో కలిసి కామెడీ పండించబోతున్నాడు. మన్మథుడు 2 లో ఫుల్ లెన్త్ రోల్ ప్లే చేస్తున్న వెన్నెల కిషోర్.. ఈసినిమాకి మెయిన్ హైలెట్ అంటుంది మూవీ టీం. రాహుల్ రవీంద్రన్ వెన్నెల పాత్ర ద్వారా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించబోతున్నాడట. మన్మథుడు 2 ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక తాజాగా వెన్నెల కిషోర్ కి మరో మంచి పాత్ర పడిందట. అది కూడా కామెడీ పంచ్ లతో అందరిని మైమరపింపజేసే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కతున్న సినిమాలో.

ఈ సినిమాలో సునీల్ కూడా ఉన్నాడనే ప్రచారం జరిగింది. కానీ తాజాగా సునీల్‌ని ఈ సినిమా నుండి తప్పించి.. వెన్నెల కిషోర్ పాత్రని త్రివిక్రమ్ హైలెట్ చేస్తున్నాడట. వెన్నెల కిషోర్ కోసం అద్భుతమైన పాత్రను త్రివిక్రమ్ ఈ సినిమాకోసమే రాశాడట. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం అల్లు అర్జున్ - వెన్నెల కిషోర్ కి మధ్య వచ్చే సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయని.. అలాగే సెకెండాఫ్‌లో ప్రీ క్లైమాక్స్ లో వచ్చే సీక్వెన్స్ లో కూడా కిషోర్ పగలబడి నవ్వేలా కామెడీ పండించేలా త్రివిక్రమ్ కామెడీ పంచ్‌లు రాసాడట. మరి ఈ రెండు సినిమాలు హిట్ అయితే.. నిజంగానే వెన్నెల కిషోర్ పెద్ద కమెడియన్ అయినట్లే.

Vinnela Kishore Role Highlights in Nag and Bunny Movie:

Vinnela Kishore in Manmadhudu 2 and Trivikram Film 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs