సీనియర్ నటి విజయశాంతి అలియాస్ రాములమ్మ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. సూపర్‌స్టార్ మహేశ్ బాబు, రష్మిక మందన్నా నటీనటులుగా అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం ఇప్పటికే షూటింగ్ షురూ చేశారు. ఈ సినిమాతో రాములమ్మ రీ ఎంట్రీ ఇస్తున్న ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అంతేకాదు ఈ పాత్రకోసం భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
కాగా.. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తర్వాత రాములమ్మ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ కీలక నిర్ణయం మరేదో కాదు.. కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పేసి కాషాయ కండువా కప్పుకోనుందని సమాచారం. ఇప్పటికే పలువురు కమలనాథులు ఆమెను సంప్రదించగా.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. రాములమ్మ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిందే భారతీయ జనతా పార్టీతో అనే విషయం విదితమే. బీజేపీతో ఎంట్రీ ఇచ్చిన రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకున్న విజయశాంతి మళ్ళీ ఆ పార్టీలో చేరనున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు గత కొన్ని రోజులు వినిపిస్తున్నాయి. రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌కు గడ్డుకాలం రావడం అంతేకాదు.. తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా బీజేపీ విస్తరిస్తుండటంతో విజయశాంతి ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.