Advertisement
Google Ads BL

‘సాహో’ నుంచి మరో పోస్టర్ వదిలారు


సాహో విడుదలకు రెడీ అయ్యేందుకు సిద్ధమౌతోన్న సందర్భంలో.... సినిమాలో నటించిన ఒక్కో పాత్రను పరిచయం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్, శ్రద్ధాకపూర్ లుక్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు నటుడు అరుణ్ విజయ్ లుక్‌ని విడుదల చేశారు. తమిళంలో పలు సూపర్ హిట్ చిత్రాల్లో... విభిన్నమైన క్యారెక్టర్స్ చేస్తూ.... మంచి పేరు తెచ్చుకున్న అరుణ్ విజయ్.. సాహోలో అద్భుతమైన పాత్రతో మెప్పించబోతున్నాడు. 

Advertisement
CJ Advs

భారీ ఖర్చుతో తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ప్యాక్‌డ్ సినిమాలోని ప్రతి క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్ ఉంది. అలాగే అరుణ్ విజయ్ పాత్ర సినిమాలో చాలా కీలకం. ఈ పాత్రను ప్రత్యేకంగా డిజైన్ చేశారు.

‘‘Blood doesn’t need bloody invitation’’ అనే క్యాప్షన్‌ని బట్టే ఈ క్యారెక్టర్ ఎంత పవర్ ఫుల్‌గా వుండనుందో అర్థం చేసుకోవచ్చు. 

యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్, బాలీవుడ్ బ్యూటీ శ్ర‌ద్ధాక‌పూర్ జంట‌గా యు.వీ క్రియేష‌న్స్ ప‌తాకంపై వంశీ, ప్ర‌మోద్, విక్ర‌మ్‌లు ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్న చిత్రం ‘సాహో’. యంగ్ డైరెక్ట‌ర్ సుజిత్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. అత్యంత భారీ బ‌డ్జెట్‌తో హై స్టాండ‌ర్డ్స్ టెక్నాల‌జీ‌తో తెరెకెక్కుతుంది. ఈ చిత్రం ఆగస్ట్ 30న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు.  బాహుబలి లాంటి చిత్రం త‌రువాత వ‌స్తున్న చిత్రం కావ‌టం‌తో రెబ‌ల్‌స్టార్ ఫ్యాన్స్ తో పాటు ఇండియ‌న్ సినిమా ల‌వ‌ర్స్ అంద‌రూ ఈ సినిమా‌పై భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు. దీంతో మేక‌ర్స్ ఎక్క‌డా చిన్న విష‌యంలో కూడా కాంప్ర‌మైజ్ కాకుండా ఆడియ‌న్స్ కి పూర్తి వినోదాన్ని క్లారిటి ఆఫ్ క్వాలిటీతో అందించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్-విక్ర‌మ్‌లు ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Arun Vijay Look From Saaho Released:

Arun Vijay’s poster from Saaho says: Blood Doesn’t need Bloody Invitation
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs