Advertisement
Google Ads BL

విలన్ పాత్ర తర్వాతైనా పుంజుకుంటాడా?


తన మొదటి చిత్రం ఆర్‌ఎక్స్‌ 100తో సూపర్ హిట్ అందుకున్న కార్తికేయ ఆ తరువాత చేసిన హిప్పీ డిజాస్టర్‌గా మిగిలింది. ఇక లేటెస్ట్‌గా చేసిన గుణ 369 పర్లేదు అనిపించుకుంది కానీ కలెక్షన్స్ మాత్రం ఏమి అంతగా రావడంలేదు. మాస్ సినిమా కదా అందరికి కనెక్ట్ అవుతుందని హీరో భావించాడు కానీ అది వర్కవుట్ అయినట్టు కనిపించడంలేదు.

Advertisement
CJ Advs

మొదటి సినిమా సక్సెస్ అయినప్పుడే నెక్స్ట్ ఎటువంటి సినిమా చేస్తే బెటర్? ఏ విధంగా తమ స్థానం పదిలమవుతుందో అంచనా వేసుకోవడంలోనే హీరో భవిష్యత్తు ఆధారపడుతుంది. కానీ కార్తికేయ అలా చేయలేదు. ప్రస్తుతం అతను నాని సినిమాలో విలన్‌గా చేస్తుండడంతో ఈ పాత్ర పైనే ఆశలు పెట్టుకున్నాడు. ఈ పాత్ర క్లిక్ అయితే మనోడికి కెరీర్ పరంగా మంచి భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే కొంచం కష్టమే.

పైగా కార్తికేయకి మార్కెట్ కూడా లేకపోవడంతో ప్రొడ్యూసర్స్ కూడా ఇతనిపై ఇన్వెస్ట్ చేయడానికి ముందు రావడంలేదు. దీంతో విలన్ పాత్రలు చేసిన తరువాత గోపీచంద్ హీరోగా ఎన్నో విజయాలు అందుకున్నాడు. అలానే కార్తికేయ కూడా అటువంటి అవకాశం సద్వినియోగం చేసుకుంటే మంచిది అంటూ సలహాలు ఇచ్చేవారు ఎక్కువయ్యారట.

Hero Karthikeya Villain in Nani Movie:

RX 100 Karthikeya Turns Villain for Nani
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs