Advertisement
Google Ads BL

‘బందోబస్త్’ అంటే ఎందుకు భయం?


సూర్య - సయేషా సైగల్‌తో పాటుగా మలయాళ టాప్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటిస్తున్న ‘బందోబస్త్’ సినిమా సాహోకి దొరక్కుండా... సెప్టెంబర్ 20న రావడానికి రెడీ అయ్యింది. నిన్నటివరకు సాహోతో బందోబస్త్ పోటీపడుతుందనుకున్నారు. కానీ సూర్య తెలివిగా ప్రభాస్‌తో పెట్టుకోవడం అవసరమా అని సైలెంట్‌గా తప్పుకున్నాడు. ఇక ఎప్పుడో కోలీవుడ్‌లో సూర్య బందోబస్త్ ప్రమోషన్స్  స్టార్ట్ కూడా అయ్యాయి. బందోబస్త్ ఆడియో లాంచ్ వేడుకని కోలీవుడ్‌లో ఘనంగా నిర్వహించారు. ఇంత సాఫీగా సాగుతున్న బందోబస్త్‌కి కష్టాలేమిటా అని ఆలోచిస్తున్నారా....

Advertisement
CJ Advs

బందోబస్త్‌కి కోలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది.. అలాగే అంచనాలు కూడా ఉన్నాయి. కానీ తెలుగులోనే బందోబస్త్‌కు కష్టాలు మొదలయ్యాయి. ఎందుకంటే సూర్య గత సినిమాల ఎఫెక్ట్ ఈ బందోబస్త్ మీద పడింది. సూర్య సింగం సీరీస్ తో తెలుగు సినిమాల మీద పై చెయ్యి సాధించినా..... తర్వాత వచ్చిన నాలుగైదు సినిమాలు ఫట్ అనడంతో.. సూర్య కొత్త సినిమాలు కొనాలంటే తెలుగులో బయ్యర్లకు వణుకు పట్టుకుంది. గ్యాంగ్, ఎన్జీకే సినిమాలు అట్టర్ ప్లాప్ అవడంతో సూర్య బందోబస్త్ అంటేనే భయపడుతున్నారు డిస్ట్రిబ్యూటర్స్. ఆ సినిమాలకొచ్చిన లాస్ తో బందోబస్త్ సినిమా మీద ఎవరు ఇంట్రస్ట్ పెట్టడం లేదు. ఇక సూర్య సినిమాలకు ముందు 10 కోట్ల వరకు గిరాకీ ఉండేది. కానీ చాలా సినిమాలు డిజాస్టర్ అవడంతో.. ఇప్పుడు బందోబస్త్ మీద క్రేజ్, అంచనాలు తెలుగులో లేకపోవడంతో.. ఈ సినిమాను తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం.

Problems to Suriya Bandobast in Tollywood:

No Distributors to Suriya Bandobasth in Telugu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs