Advertisement
Google Ads BL

పూరీపై విజయ్‌దేవరకొండ కోటి ఆశలు!


టాలీవుడ్‌లో వరుస విజయాలతో మంచి ఊపు మీదున్న క్రేజీ హీరో విజయ్ దేవరకొండకు ‘డియర్ కామ్రేడ్’ గట్టిగానే దెబ్బేసింది. దీంతో వాట్ నెక్స్ట్.. అంటూ విజయ్ ఆలోచనలో పడ్డాడట. ఫైనల్‌గా ఓ నిర్ణయానికి వచ్చాడట. తెలంగాణ యాసతో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’తో సూపర్ సక్సెస్ అవ్వడంతో డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో ఓ సినిమా తీయాలని ఫిక్స్ అయ్యాడట. అంతేకాదు లాంగ్ గ్యాప్ తర్వాత తనను మాస్ ప్రేక్షకులకు దగ్గర చేస్తాడని ఆయనపై కోటి ఆశలు పెట్టుకున్నాడట.

Advertisement
CJ Advs

ఈ క్రమంలో ‘పూరీ సార్... మీతో సినిమాకు నేను రెడీ’ అని విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ప్రస్తుతం ఫిల్మ్‌నగర్‌లో ఇందుకు సంబంధించిన పుకార్లు పెద్ద ఎత్తున షికార్లు చేస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది సినిమా ఉండొచ్చని గుసగుసలు వినిపిస్తున్నాయి. పూరీ మాస్ అయితే.. విజయ్ ఊరమాస్ గనుక ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తే మాత్రం ఇక బాక్సాఫీస్ బద్దవ్వడం ఖాయమే.. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు.

అయితే.. గత కొన్ని రోజులుగా సూపర్‌స్టార్ మహేశ్ కోసం అనుకున్న ‘జనగణమన’.. విజయ్‌తో పట్టాలెక్కనుందని వార్తలు వినవచ్చాయి. అయితే అదే సినిమాను కంటిన్యూ చేస్తారా..? లేకుంటే విజయ్ కోసం మాస్ కథను సిద్ధం చేస్తారా..? అన్నది తెలియాల్సి ఉంది. ఈ ఇద్దరి కాంబోలో సినిమాపై ప్రకటన ఎప్పుడొస్తుందో..? సెట్స్‌పైకి ఎప్పుడెళ్తుందో..? అసలు పూరీ-విజయ్ దేవరకొండ కాంబోలో సినిమా ఉంటుందా..? లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

News About Puri-Vijay Movie:

News About Puri-Vijay Movie  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs