Advertisement
Google Ads BL

నాకు నిజంగానే పెళ్లైంది.. అమెరికా వెళ్లిపోతున్నా!


బాలీవుడ్ హాట్ భామ రాఖీ సావంత్ పెళ్లిపై గత కొన్నిరోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇది రియల్ లైఫ్‌లో పెళ్లి కాదని సినిమా షూట్‌లో భాగంగా ఈ గెటప్ వేసిందని కొందరు.. లేదు లేదు నిజంగానే పెళ్లియిపోయిందని మరికొందరు అనుకున్నారు. ఈ కన్ఫ్యూన్‌తో అసలేం జరుగుతోంది..? ఏది నిజం..? ఏది అబద్ధం..? అనేది తెలియక రాఖీ అభిమానులు ఒకింత కంగుతిన్నారు.

Advertisement
CJ Advs

తాజాగా ఈ వ్యవహారంపై ఎట్టకేలకు ఈ సెక్సీ భామ క్లారిటీ ఇచ్చేసింది. ఎస్.. మీరు విన్నది నిజమే.. తనకు పెళ్లయ్యిందని ఒప్పుకుంది. తనను ఓ ఇంటర్వ్యూలో చూసి ఆయన ప్రేమలో పడ్డాడని అలా మా ప్రేమ మొదలైందని.. అలా ఇద్దరం దగ్గరై పెళ్లి చేసుకున్నామని రాఖీ చెబుతోంది. ‘నాకు రితీశ్‌ వీరాభిమాని. ఆయనతోనే పెళ్లి జరగాలని దేవుడ్ని చాలా సార్లు కోరుకున్నాను.. పైనున్న దేవుడు నా మొర ఆలకించి రితీశ్‌తో పెళ్లి జరిపించాడు’ అని రాఖీ మనసులోని మాటను చెప్పింది. తన భర్త ఎన్నారై రితీశ్ అని.. పెళ్లయ్యాక మళ్లీ అమెరికా వెళ్లాడని వీసా వస్తే తాను కూడా వెళ్లిపోతానని మీడియాకు వివరించింది.

మంచి పాత్రలు వచ్చినప్పుడు కచ్చితంగా ఇండియాకు వస్తానని.. టీవీ షోలు నిర్మించాలన్న తన కోరిక, కల నెరవేరబోతోందని రాఖీ చెప్పుకొచ్చింది. సావంత్ తన పెళ్లి మాటలు చెప్పగానే ఆమె అభిమానులు ఒకింత ఆవేదనకు లోనవ్వగా.. పర్లేదు మీరు మళ్లీ ఇండియాకు వచ్చి నర్తించండి అంటూ సలహాలు ఇస్తున్నారు.

Rakhi Sawant finally confirms marrying NRI after honeymoon pics trend online:

Rakhi Sawant finally confirms marrying NRI after honeymoon pics trend online  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs