Advertisement
Google Ads BL

హిట్టొచ్చింది కానీ.. ప్రాధాన్యత లేదు!


ట్రెడిషనల్ గర్ల్ గా మలయాళం నుండి అ... ఆ.. సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన అనుపమ పరమేశ్వరన్ కి తెలుగులో ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కూడా లేదు. యంగ్ హీరోలతో సినిమాలు చేస్తున్న ఆమెకి కావాల్సినంత గుర్తింపు రావడం లేదు. మంచి పాత్రలనే చేస్తున్నప్పటికీ... సినిమాలు యావరేజ్ గా మిగిలిపోవడంతో అనుపమ పరమేశ్వరన్ కెరీర్ కూడా డోలాయమానంలో పడింది. ఇక తాజాగా విడుదలైన రాక్షసుడు సినిమాలో అనుపమకి టీచర్ పాత్ర దక్కింది. మరా రాక్షసుడు సినిమా ఈ శుక్రవారమే విడుదలైంది. ఆ సినిమాకి పాజిటివ్ టాక్ దక్కింది. పాజిటివ్ టాక్ మాత్రమే కాదు.... మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ సొంతం చేసుకుంది.

Advertisement
CJ Advs

రాక్షసుడు సినిమాతో బెల్లకొండ శ్రీనివాస్ హీరోగా కెరీర్ లో మొట్టమొదటి హిట్ కొట్టాడు. తమిళ రీమేక్ అయినప్పటికీ.. తెలుగులో రమేష్ వర్మ ఆ రీమేక్ ని ఎక్కడా చెడగొట్టకుండా యాజిటీజ్ గా తీయడంతో  సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. మొదటి రోజు సినిమాకి డీసెంట్ ఓపెనింగ్స్ రావడం, మంచి టాక్ తో సినిమా రన్ అవడం బెల్లకొండ శ్రీనివాస్ కి వరమని చెప్పాలి. కానీ హీరోయిన్ అనుపమకు ఈ సినిమా ఏ మాత్రం హెల్ప్ అవుతుంది అనేది మాత్రం అప్పుడే చెప్పలేం. ఈ సినిమాలో అనుపమ టీచర్ గా డీసెంట్ లుక్ లో ఆకట్టుకుంది. అలాగే హీరో తో లవ్ జర్నీలో కూడా మంచి నటన కనబర్చింది.

కానీ ఇలాంటి క్రైం థ్రిల్లర్ మూవీస్ లో హీరోయిన్స్ కి ఎక్కువగా నటించే స్కోప్ దక్కదు. అలాగే ఈ సినిమాలోనూ అనుపమ పాత్ర లాంటిదే. కాకపోతే ఎక్కడ కథకి అడ్డం పడని పాత్ర అనుపమది. అయినప్పటికీ ప్రత్యేక ప్రాధాన్యత లేని పాత్ర ఆమెది. మరి ఈ సినిమా హిట్టు అనుపమకు ఎలాంటి మేలు చేస్తుందో అనేది కొన్ని రోజులాగితే గాని తెలియదు.

No Importance to Anupama Role in Rakshasudu Movie:

Anupama Parameswaran gets hit with Rakshasudu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs