Advertisement
Google Ads BL

యాంకర్ సుమ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే..!


టాలీవుడ్‌లో ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా.. ప్రీ రిలీజ్ ఈవెంట్స్.. సక్సెస్ మీట్‌లకు వ్యాఖ్యాత అంటే టక్కున గుర్తొచ్చే పేరు సుమ. ఒకవేళ సుమ కాకుండా మరెవరైనా యాంకర్ అయితే ఆ కార్యక్రమాలు అట్టర్ ప్లాప్ అయిన రోజులు కూడా ఉన్నాయంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. సుమ వస్తే ఆ కిక్కే వేరు.. ఆమె స్టేజ్ ఎక్కితే ఇక షో సక్సెస్సే. ఇలా టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా పేరొందిన.. రాణిస్తున్న సుమ.. ఒక్కో షో.. ఈవెంట్స్‌కు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఫిల్మ్‌నగర్‌లో చర్చనీయాంశమైంది.

Advertisement
CJ Advs

ఒక్కో ఆడియో ఫంక్షన్‌కు దాదాపు రూ. 2 లక్షల నుంచి 2.5 ల‌క్షల వ‌ర‌కు సుమ వ‌సూలు చేస్తుంద‌ని సమాచారం. ఇది కేవ‌లం ఆడియో వేడుక‌ల‌కు మాత్రమేనట. ఆడియో ఫంక్షన్ మహా అంటే రెండు గంటలకు మించి దాదాపు ఉండదు. అంటే గంటకు సుమ రెమ్యునరేషన్ లక్ష రూపాయలన్న మాట. అవార్డ్స్ ఫంక్షన్ అయితే పైన చెప్పిన రేటుకు డబుల్.. త్రిబుల్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదట. ఇక బుల్లి తెర షోలకు మాత్రం గట్టిగానే తీసుకుంటుందట. ఈ రెమ్యునరేషన్ గురించి తెలుసుకున్న ఆమె ఫ్యాన్స్ వామ్మో.. ఇంతా అని షాకయ్యారట.

సుమ.. మలయాళీ అయినప్పటికీ అచ్చం తెలుగమ్మాయిలా అనర్గంలా మాట్లాడగలదు. ఇదే సుమకు శ్రీరామ రక్షగా మారింది.. ఇతర యాంకర్లకు శాపంలా మారింది.!. కాగా.. సుమ రాజీవ్ కనకాల ‘హోమ్’ మినిస్టర్ అన్న విషయం విదితమే. ఇదిలా ఉంటే టాలీవుడ్‌లో సుమ తర్వాత స్థానంలో రెమ్యునరేషన్‌లో.. క్రేజ్‌‌లో.. హాట్ భామ అనసూయ.. ఆ తర్వాతి స్థానంలో రష్మి ఉన్నారు.

Telugu Anchor Suma Remuneration Will Shock You:

Telugu Anchor Suma Remuneration Will Shock You
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs