Advertisement
Google Ads BL

నాని ‘గ్యాంగ్‌లీడర్‌’కు ఫుల్ డిమాండ్..!


మీడియం రేంజ్ సినిమాలకి డిమాండ్ ఎక్కువ అయిపోయింది. తక్కువ కలెక్షన్స్ పెట్టి ఎక్కువ వసూళ్లు సాధించవచ్చు అని ప్రొడ్యూసర్స్ అంతా ఇప్పుడు మీడియం రేంజ్ సినిమాలపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అలానే డిస్ట్రిబ్యూటర్స్ కూడా మీడియం రేంజ్ బడ్జెట్స్ సినిమాలపై ఫోకస్ పెడుతున్నారు. భారీ చిత్రాలు కొనడం కంటే మీడియం రేంజ్ సినిమాలు కొని సేఫ్ అవ్వడం బెటర్ అనుకుంటున్నారు.

Advertisement
CJ Advs

ఈ నేపథ్యంలో నాని ‘గ్యాంగ్ లీడర్’ సినిమాపై అంచనాలు పెరిగాయి. మినిమం గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్న నాని ప్రస్తుతం విక్రమ్ కుమార్ డైరెక్షన్‌లో ‘గ్యాంగ్‌లీడర్‌’ అనే సినిమా చేస్తున్నాడు. రీసెంట్‌గా టీం రిలీజ్ చేసిన టీజర్ బాగా ప్రామిసింగ్‌గా కనిపిస్తోంది. దీంతో బయ్యర్ల ఈమూవీని కొనడానికి పోటీ పడుతున్నారు. ఆగస్టు 30న రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా సెప్టెంబర్ రెండో వారానికి షిఫ్ట్ అయింది. జెర్సీ సినిమాతో ప్రేక్షకుల మన్ననలు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న నాని ఈ సినిమాతో కూడా మంచి హిట్టు అందుకుంటాడనే టాక్ అప్పుడే వినిపిస్తోంది.

Full Demand to Nani’s Gang Leader Movie:

Nani’s Gang Leader Movie Latest Update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs